అమ్మ చేతి గోరుముద్ద తీపి జ్ఞాపకమైంది
తను చేసే సున్నుండ అపురూపమైనది

గుడిలో ప్రసాదాని కై పడిగాపులు
అయ్యగారి పిలక మీద చిలిపి కూతలు
అమ్మ తో కొత్త బట్టలకి సిఫారసులు
నాన్నకు చెప్పకుండా దొంగ చాటు సినిమాలు

గుట్టు రట్టయిన వేళ అమ్మ కొంగు నా చైనా వాలు

వేసవి సెలవులలో తాటి ముంజలకై తిప్పలు
పుల్ల ఐస్ క్రీములకై అగచాట్లు, అమ్మ పెట్టె తీపి చీవాట్లు,
అపురూపం మా అమ్మ,మనసు హిమశికరము కన్నా మిన్న
సృష్టి లోని ప్రేమానంతా రంగరించి రూపమిస్తే తను మా అమ్మ

ఎంత ఎదిగినా నీకు నీ బిడ్డనే అమ్మా !
నీ చేతి గోరుముద్దకై ఆకలితో ఉన్న
ఈ నగరజీవితం లో ఏకాకినవుతున్నా!
మన పల్లె మన ఇల్లు ఎంత గుర్తోస్తున్న
నీ కల నా ఆశయమై నన్ను నడిపుస్తున్నా
అమ్మా! నేనేదో మరిచానమ్మ!
నేనేదో విడిచి వచ్చానమ్మా !

వెతుకుతున్న ఎవరికీఎవరుఏమి కాని ఈ జనారణ్యంలో
ఎక్కడైనా మా అమ్మ ప్రేమ చవిచూస్తానేమోనని
నీకు సాటి నీవే నమ్మా ! నా చక్కని స్నేహితురాలివమ్మా !
నా మనో శక్తి నీవమ్మా !నీ సైన్యం నేనమ్మా !
నీ చిరు నవ్వు కై నేను శ్రమిస్తున్నానమ్మ !
మరుజన్మ కైనా నీవే కావాలి నా బంగారుఅమ్మ !


This entry was posted on 6:43 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    Anonymous said...

    // గుట్టు రట్టయిన వేళ అమ్మ కొంగు నా చైనా వాలు //

    అమ్మ దగ్గరుంటే వచ్చే ఆ ధైర్యానికి ఇంతకన్నా మంచి ఉపమానమేముంటుంది ? చాలా బాగుంది !

  1. ... on November 20, 2012 at 2:15 AM  

About Us