చాలా రోజులయింది నేస్తం
ఇలా నిదురలేని రాతిరి గడిపి
నీ స్నేహపు చిరుజల్లు లో తడిసి
నిను మరచిపోయానని అనలేను
మరవడానికి నేవో జ్ఞాపకం కాదు
నా జీవితం లో భాగం నీవు...

ఆ హాస్టల్ ఆవరణ,కాంటీన్ లో చేసిన అల్లరి
మన సుబ్బిగాడి తో దోశల కోసం చేసిన రగడ
తోట లోని గులాబీలన్ని నాకే సొంతం అని నీవు చేసిన బీభత్సం
నా కురుల అలంకరించ నీవు నాటిన ఆ మల్లెపాదు
ఇప్పుడు అక్కడ పూలు పూస్తుందో లేదో కాని ,
విజ్జీ...!వాటి పరిమళం మాత్రం నను తాకుతూనే ఉంది

నేనెవరని నను అంతగా ప్రేమించావు?

నాకోసం నువ్వు చేసిన పార్ట్ టైం జాబులు
నా రిజల్ట్స్ కి మనం చేసుకున్న పానిపురి పార్టీలు
న్యూ ఇయర్ సంబరాలు,
మెస్ బిల్లులతో వేసుకున్న బోగి మంటలు
హోలీ లో నన్ను సప్తవర్ణాలతో ముంచెత్తి
ముచ్చటపడిన తీరూ,దోభి గాటు లో మన కూనిరాగాలు
గప్పాలు కొడుతూ ,వెన్నెల్లో పాటలు పడుతూ
స్నేహజీవితం అందం అని నీవు చెప్పిన తీరూ!

ఏమని చెప్పను కుట్టి!
ప్రేమని చెప్పడానికి నాకు సంశయం లేదు
కాని ప్రపంచానికి తెలిసింది ఆడ మగా ప్రేమే..!
అయినా ఆ చిన్న పదం నీకు నే ఆపాదించలేను

నాలో అంత వింతేమి ఉందో ఇప్పటికి నాకు తెలీదు
నీతో ఉన్న ప్రతీ క్షణం ప్రేమ తప్ప మరోటి నేను చూడలేదు
అన్నిటికి కొసమెరుపుగా నువ్వు నన్ను అమ్మా అని పిలిచే పిలుపు
అన్నీ నువ్వు చేస్తూ..
కంటికి రెప్పల ప్రేమిస్తూ..
నేను నీ అమ్మ నని సంబోధించావే
ఏమి చేసాను రా నీకు
ఓ రెండు ఓదార్పు మాటలు తప్ప!
నీకు నేను అమూల్యం అంటావు ఇప్పటికి
కాని నేస్తం నువ్వు నా జీవితం లో ఓ సువర్ణాక్షరం
దేవుడిచ్చిన అత్యంత ప్రీతీ కరమైన వరం
సఖి !నీ స్నేహం మధురాతి మధురం!
I MISS U RAAThis entry was posted on 11:57 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    dr said...

    చాలా బాగుంది !

  1. ... on November 20, 2012 at 2:11 AM  

About Us