ఓ దైవమా
ధైర్యం చేసి ఓ దిగులును
నీతో విన్నవించుకుంటున్నా
సూటి గా నాలో రగిలే
ప్రశ్నా జ్వాలను నీ ముందుoచుతున్నా

మట్టి కి ప్రాణం పోసి
మమత తో మనసు చేసి
నీ చేతి తో నా తల రాత రాసావే
మనసు కోరే ఆశ,విధి తో
ఎందుకు వివరించలేదు
నా మనసు తపన
నీవు రాసిన రాత
రెండు నీ కల్పితాలే కదా
మరి నన్నెందుకు పావుని చేసావు?

ఒంటరిగా నేనున్నా వేళ 
జంటను నే కోరానా
తుంటరి ఊసులతో
ఎప్పుడైనా నే తల్లడిల్లానా
కావాలని నాకు ఓ జతను ఎంచి
తనతో నాకు జీవితం పంచి
నేడు చిన్న మాట తో ఎడబాటు చేసి
అర్థం కాని వ్యర్థం లా నను మిగిలిచావు
ఇది నీకు భావ్యమా ?

కనకరాసులు నే కోరానా
కలిమిలేమిలలో నే వగచానా
నీవు ఇచ్చిన తోడు
నాకు నీడలా  ఉంటుందని
పసిపాప లా చూసుకుంటుందని
నిర్వాజ్యం గా నమ్మానే తప్ప
నిరంకుశం గా తూలనాడానా?

పుట్టిన నా జన్మకు
పరిపూర్ణత తేవాలని
ఎన్నో విధాలుగా   పరితపిస్తున్న
ఇది మాయ మోహిత జీవనం
ఎక్కడుంది నాకై పరితపించే హృదయం ?

ధైర్యం చేసి చొరవతో  అడుగుతున్నా
నీనిశ్శబ్దంలో సమాధానం వెదుకుతున్నా....   




 




This entry was posted on 12:20 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments:

    నరసింహ మూర్తి said...

    భగవంతుని తో నివేదించుకునే మీ హృదయ పరిపక్వత చాలా బాగుంది. ప్రశ్నా జ్వాలతో మొదలయ్యి ,నిశ్శబ్దంలో సమాధానాన్ని వెతుకటం లో ముగిసింది.ఈ భావుకత ఎక్కడికి చేరాలో అక్కడికి ఇప్పటికే చేరి ఉంటుంది.భావుకత అద్భుతంగా ఉంది... ప్రతి అక్షరంలో ప్రార్థన ఉంది. మాటలని మౌనం వైపు నడిపించినట్టుగా అనిపించింది...
    నమస్కారాలు తెలియజేస్తూ
    నరసింహ మూర్తి

  1. ... on November 12, 2009 at 9:45 AM  
  2. siri said...

    narshima murthy gaaru

    chalaa thanks andi

  3. ... on November 22, 2009 at 2:42 AM  

About Us