కన్నా!
నాఒడిలో ఆడుకున్న చిన్నికృష్ణుడివేనా నీవు
వెన్న ముద్దలు తినిపిస్తూ ,పించము పెట్టి
కస్తూరి తిలకము దిద్ది ,మువ్వలు కట్టి
ముస్తాబు చేసిన ముచ్చట ఇంకా తీరనే లేదు!

యదుకులం లో చేసిన అల్లరి
గోపికలు చేసిన ఫిర్యాదులు
ఉట్టి కొట్టి వెన్న దొంగిలించిన వైనాలు
మట్టి తిని విశ్వాన్ని చూపిన చిత్రాలు
ఇంకా ఇప్పుడే జరిగినటుల ఉన్నది కృష్ణా!

ఈ అల్లరి కి నేను నీ పై అలిగితే
అమ్మా అని గారాబం చేస్తూ...
నీ బుజ్జి చేతులతో నా బుగ్గతడిమిన
స్పర్శ ఇంకా నులి వెచ్చగానే ఉంది యదునందనా !

మధుర లో నీవున్న నీ మధుర జ్ఞాపకాలతో
నేను నిత్యం నీతో నే ఉన్న కదా కన్నా!
ఇంత నిడివి లోనే అంత వాడివయ్యావు
యశోదనందనుడు అయిన నా చిన్ని కృష్ణా ,
మదురాధిపతివై,రుక్మిణి కృష్ణుడవయ్యావు!
    
నిన్ను దండించిన ఈ చేతులను
రోటి కి కట్టిన ఈ కఠోర కరములను
నోటి తో ఒక్క మాటైన పలకక
ఇలా నన్ను దండిస్తావా?
ఇది నీకు న్యాయమా  మానస చోరా ?

పదహారు వేల కన్నియలను పెండ్లాడిన
నా ముద్దు కృష్ణుడి   కళ్యాణ కాంతి ని
కన్నులార దర్శించే బాగ్యం లేదే !
కాటిన్యం గా దండించేనని ఈ కరములకు
ఈ కళ్యాణ కిశోరుని ప్రియమార తడిమి
హత్తుకునే అదృష్టం  లేదే !

అనంత కోటి బ్రహ్మాండ నాయక!
ఈ స్త్రీ జన్మ నీ పుత్రవ్యామోహ మహిమ
నాకు నీవు పుత్రుడివే కాని
ఈ విశ్వ నాయకుడిలా చూడలేను!
నను మన్నించి ఈ అమ్మ కు
నీ కళ్యాణ భాగ్యం కలిగించు
మనోహర   మోహనాకారా !


This entry was posted on 5:36 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

  colorwizard said...

  mana puranalu meda ryakunda udtam machidi siri garu

 1. ... on November 16, 2009 at 1:24 AM  
 2. siri said...

  thank u for ur opinion Mr.Colorwizard
  advice is noted

 3. ... on November 16, 2009 at 2:37 AM  
 4. drsandy said...

  chaala baagundi.... nijangaa yashodha paata paaduthu maa munduki vachinattundi... I feel 'సీతా.....' , 'మర్యాద పురుషోత్తమా ...! శ్రీ రామచంద్రా!' & 'కళ్యాణ కృష్ణుడిని చూడాలని యశోదమ్మతపన' are best of your work... HATS OFF!!!

 5. ... on November 18, 2009 at 10:05 AM  
 6. siri said...

  thank you sandeep

  nuvvu kannadaa lo keep rocking

 7. ... on November 22, 2009 at 2:40 AM  

About Us