మాటరాని మనసుకు
ఎన్నో ఊసులు
క్షణభంగుర  జీవితానికి
ఎన్నెన్నో సవాళ్ళు

అయినా
కడగల్లు లేని జీవితం
భిందువు లేని సింధువే కదా!
మరెందుకు ఈ వేదన
లోలోపలే  ఉండే ఆవేదన !

మౌనాని సైతం పలికిస్తా
కాని నా స్థితి చెప్పలేక  
మౌనమే నా పలుకైనదే
సరదాకైన నిను మరువలేను  
అని సరాగాలు పాడే హృది కి
నిన్ను మరిచి పోమని ఎలా చెప్పను ?

తాను నా గుండెనడిగినా  
చిరునవ్వుతో ఇస్తానన్నా!
కాని గుండెలేని నీ గూడు
తాను అడుగుతుందనుకొని
అణుమాత్రమైనా అనుకోలేదే !

ఏమి తెలుసు తనకి
నేనిచ్చే రోజా పువ్వు
నా పెదాలపై నవ్వు తప్ప!

నన్ను గా స్వీకరించే
సుమదుర స్నేహం నీవు
నేనింకా  పసివాడినే అనే
బాల్య స్నేహ పరిమళం నీవు
ఏ మాలిన్యం లేని స్నేహ మాలిక నీవు!

వింతగా ఉంది నాకంతా
నా మనసు గెలుచుకున్న
తనకు తెలీదా ఇదంతా?

కాని నా నేస్తమా!
నీపై నిందలు వేసే తనకు
నీ స్నేహమాదుర్యం ఏమి తెలుసు ?
నిను వదులుకోమని నాతో పలికిన ఘడియ  
నాలో రేగిన ఆ పెనుతుఫాను
ఆ ప్రియురాలి హ్రుదయానికేమి తెలుసు ?

ప్రేమ గొప్పదే కాని
అంతా నాదే అన్న స్వార్ధమేమో!
ఆ జవరాలు ఇల్లాలైతే
నా స్నేహభావం తనకు తెలియునేమో ?!

అనురాగమా!
సువిశాల  జగత్తు లో
ఇరుకైన మనుస్సులో
యాంత్రిక జీవన నడవడిక లో
నాకో స్థానం ఇచ్చినందుకు
నీకు కృతజ్ఞత ఎలా తెలపను?
ఆ స్థానం లో నేను ఎప్పటికీ ఉంటానని తెలిసినా
నిను మళ్ళి కలవలేనేమో అనే బెంగ ఎలా వివరించను?




 
 




This entry was posted on 11:40 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments:

    కెక్యూబ్ వర్మ said...

    బాగున్నాయి మీ కవితలు. మీ బ్లాగు చూడముచ్చటగా వుంది. carry on my friend...

  1. ... on November 19, 2009 at 6:51 AM  
  2. siri said...

    thank you andi
    mee name thelisthe baagundu..

  3. ... on November 22, 2009 at 2:40 AM  

About Us