ఒంటరిగా ఉన్నవేళ
వేల వేల ప్రశ్నలు
సమాదానం నిశ్శబ్దం
అని తెలిసిన విసిగించే పరిస్థితులు

అల్లారుముద్దుగా పెరిగిన ఆఇంటిని
ఆనందమే నా చిరునామా చేసిన ఆ ఆవరణని 
మూరెడు పసుపుతాడు తో
అరనిమిషంలో చుట్టాన్ని  చేసారు
పండగలకి పబ్బాలకి అతిదిని చేసారు

తప్పటడుగులు  నేర్పిన నాన్న
రెండుపదుల ప్రాయం వరకు
రాకుమారి లా చూసిన నా వాళ్ళు
ఏడడుగుల  తో ఒక్కసారిగా
నన్ను వెళ్ళి రమ్మని పరాయిని చేసారు!

జన్మకు తోడు కలిపామంటూ
జన్మనిచ్చిన వారు ఒక్క ఘడియ లో
అపరిచితవ్యక్తి  చేతిలో నను పెట్టి
జన్మాంతం వారికి నను  దూరం చేసారు !

మీ అమ్మ మీ నాన్న అంటారు తను
కాని మా అత్త మా మామ అనాలి నేను!

కన్నవాళ్ళను చూడ  కావాలి అనుమతులు
మారాలి ఒక్కసారిగా కట్టుబొట్టు మర్యాదలు!

అప్పటివరకు చదువుల  తల్లి   నేను
ఆ క్షణమే అవ్వాలి అపర అన్నపూర్ణ
ఆకతాయి అల్లరి మరచి ,
కొత్త ఇల్లాలి తుళ్ళింత మరచి
అవ్వాలి నేను అరవయి ఏళ్ళ ఆరింద!

ఉన్నమాట అని పదుగురి నోట పడే కన్నా    
చిన్న నవ్వురువ్వి నిన్ను
కాదనుకోమంటుంది  అమ్మ!

మళ్ళి కొత్త జన్మేతినట్లు
అంతా కొత్త అలవాట్లు
కొంగొత్త  అనుభవ పాఠాలు  !

ఇక అదే నీ ఇల్లు
అంటుంది  అమ్మ
కోపమొస్తే మీ ఇంటికి పో
అంటాడు ఆయన!

మరి ఏది నా ఇల్లు ?
ఎవరికీ నే  ముఖ్యం?   

ఈ మీమాంస తేలేలోపు ఇంకోఘట్టం
మాతృ మూర్తి గా పదవీస్వీకారం
అంతులేని సాగరం ఈ జీవనం
భావోద్వేగ అలల పరంపర అనివార్యం ! 


This entry was posted on 1:28 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 comments:

    harsha.vemula said...

    akka entha baaga raasaru
    oka ammai tana jeevithamloni prathi sanniveesaanni
    kaani maa bava ni aparichithunni chesaru
    meeru cheppindhi correct akka

  1. ... on November 21, 2009 at 9:41 PM  
  2. హను said...

    cheppanu kadaa,bagumTumdi ani, nijamga nice.

  3. ... on November 22, 2009 at 1:55 AM  
  4. Unknown said...

    meeru me thoughts chala excelent ga present chesaru ....
    but u r thoughts are just like one way track....
    plz go through two way tack bcoz life is not single way track its a two way track some times its a multy track also...
    am really appreciating for ur excellency...

  5. ... on February 15, 2010 at 11:59 PM  
  6. Madhav said...

    ఆడపిల్ల ' ఆడ ' పిల్ల అవ్వడం బాధాకరమైన సన్నివేశం. అయినా అనివార్యం . పెనిమిటి మంచి వాడే అయినా , వలచిన ప్రియుడే అయినా ఆడపిల్ల అంతరంగం అలాగే వుంటుంది . చాలా చక్కగా ప్రెజెంట్ చేసారు .

  7. ... on February 20, 2010 at 7:59 AM  
  8. Raghu Mandaati said...

    Bavundhi...

  9. ... on March 3, 2010 at 3:12 AM  
  10. Anonymous said...

    "ఇక అదే నీ ఇల్లు
    అంటుంది అమ్మ
    కోపమొస్తే మీ ఇంటికి పో
    అంటాడు ఆయన!

    మరి ఏది నా ఇల్లు ?
    ఎవరికీ నే ముఖ్యం? "

    గుండె మెలిపెట్టిన భావన...సొదరీ ఇది మనకు తప్పని సరి....

  11. ... on November 28, 2011 at 12:56 AM  

About Us