చకోరపక్షిలా   వేచి   చూస్తాను  
ఏనాటికైనా   నేనే   నీ చెలినైతే!
సమాజానైనా ఎదురిస్తా
నీ ప్రేమ లో స్వచ్ఛత  ఉంటె!
నీ కలగానైనా మిగిలిపోతాను
నీకు నేనుఒక మదుర స్మతినైతే !
నా మృగ తృష్ణ జీవితం లో
ఎండమావులే ఉన్నాయనుకున్నా ఇన్నాళ్ళు!
నీ ఆగమనంతో తెలిసింది..........
నే ఎడారిని కాను పూతోటకి ఆరంభానని!
నీ మది మేఘుడు  ప్రేమాంబుధి తో నను తడపగా
నీ రాక తో నే పున్నమినాటి బృందావనినయ్యాను!
కాని..
ఎడారిలానే బాగున్నాను...
ఎవరు రారు శబ్దంలేని ప్రశాంతత
నీవు ప్రాణంపోసిన బృంధావనిలోకినిలోకి
ఎవరైనా వస్తే  సహించగలనా 
కల్పించుకొని మరీ వస్తాయి తుమ్మెదలు
ఆ పూ తేనెల విందులకి

మరి
ఆ మరో రూప సృష్టి కర్తవి
నీవా పూల  సుగందానికి దూరంగా ఎందుకు
కాని మర్చిపోకు ఈ మదిబృందావని నీది ఎప్పటికి....


కలకాలం నీతో ఉండాలని
కోటి ఆశలతో  నీ దరికి చేరాను
కోరింది ఇస్తావని కాదు,
అడగకముందే ఆచరిస్తావని కాదు
కలికముకైనా నాలో ఒంటరి తనపు
ఊసు కలలో కూడా రానీయవని

ఆత్మసఖా!
నీ తలపులతో గడిపే రోజు
నీ మాటలతో కరిగే క్షణం
నీ ప్రేమ తో చిన్నదైన రేయి
ఇలా ఎన్నెన్నో ఊహలు 
చెప్పనలవి కాని చిలిపి ఊసులు

ఎదుట నీవున్నా,
ఎవ్వరు లేని ఏకాంతమైనా
నాకు కావాల్సిన నీవు, నీవు కాదు   
ఏదో దూరం ,కంటికి నీరు రాని ఏదో శోకం

నీకు నా మనసు ఎందుకు అర్థం కాదు
నా హృది నీకు తెలిసే  వరకు
నా జీవితం లో వసంతం రాదు

చంద్రుడి వంకే చూసే చక్రవాకమై
ఎదురుచూస్తున్నాను నా నీ కై,


నా కనుల కొలనులో బాష్ప కమలం వికసించినపుడు
నీ మదుర స్మృతి  నిన్ను  బాదిస్తుందా అని అంటోంది చిరుగాలి ! 
ఏకాంతంగా మౌనంగా గుబులు గుబులు గా ఉన్నప్పుడు
నీ తో మాట్లాడాలని ఉందా అని ప్రశ్నిస్తాయి ముంగురులు!
సభలో స్తబ్దత గా ఉంటె ఏ సందడి చేయకుంటే
నీవు లేని లోటు కనపడుతుందా అంటుంది మనోగతం !
ముస్తాబై నీరాకకై   ఎదురుచూస్తున్న వేళ 
నీకు నేను ఒక యుగంలా ఉన్నానా అని కవ్విస్తుంది  నిమిషం !

అన్నింటికీ తెలుసు నాకు నీ మీదున్న ఆప్యాయత
కాని నీకు తెలియదో  ,తెలిసినా మరచావో
ఏది  తేలక ,తెలుసుకోలేక నే సతమవుతున్నా !

నిజం చెప్పవా నేస్తం!
నాకు ఈ తీయటి మాటలకన్నా
చేదుగా ఉన్నా నీవు చెప్పే నిజాన్నే ప్రేమిస్తా!


About Us