చకోరపక్షిలా   వేచి   చూస్తాను  
ఏనాటికైనా   నేనే   నీ చెలినైతే!
సమాజానైనా ఎదురిస్తా
నీ ప్రేమ లో స్వచ్ఛత  ఉంటె!
నీ కలగానైనా మిగిలిపోతాను
నీకు నేనుఒక మదుర స్మతినైతే !
నా మృగ తృష్ణ జీవితం లో
ఎండమావులే ఉన్నాయనుకున్నా ఇన్నాళ్ళు!
నీ ఆగమనంతో తెలిసింది..........
నే ఎడారిని కాను పూతోటకి ఆరంభానని!
నీ మది మేఘుడు  ప్రేమాంబుధి తో నను తడపగా
నీ రాక తో నే పున్నమినాటి బృందావనినయ్యాను!
కాని..
ఎడారిలానే బాగున్నాను...
ఎవరు రారు శబ్దంలేని ప్రశాంతత
నీవు ప్రాణంపోసిన బృంధావనిలోకినిలోకి
ఎవరైనా వస్తే  సహించగలనా 
కల్పించుకొని మరీ వస్తాయి తుమ్మెదలు
ఆ పూ తేనెల విందులకి

మరి
ఆ మరో రూప సృష్టి కర్తవి
నీవా పూల  సుగందానికి దూరంగా ఎందుకు
కాని మర్చిపోకు ఈ మదిబృందావని నీది ఎప్పటికి....


కలకాలం నీతో ఉండాలని
కోటి ఆశలతో  నీ దరికి చేరాను
కోరింది ఇస్తావని కాదు,
అడగకముందే ఆచరిస్తావని కాదు
కలికముకైనా నాలో ఒంటరి తనపు
ఊసు కలలో కూడా రానీయవని

ఆత్మసఖా!
నీ తలపులతో గడిపే రోజు
నీ మాటలతో కరిగే క్షణం
నీ ప్రేమ తో చిన్నదైన రేయి
ఇలా ఎన్నెన్నో ఊహలు 
చెప్పనలవి కాని చిలిపి ఊసులు

ఎదుట నీవున్నా,
ఎవ్వరు లేని ఏకాంతమైనా
నాకు కావాల్సిన నీవు, నీవు కాదు   
ఏదో దూరం ,కంటికి నీరు రాని ఏదో శోకం

నీకు నా మనసు ఎందుకు అర్థం కాదు
నా హృది నీకు తెలిసే  వరకు
నా జీవితం లో వసంతం రాదు

చంద్రుడి వంకే చూసే చక్రవాకమై
ఎదురుచూస్తున్నాను నా నీ కై,


నా కనుల కొలనులో బాష్ప కమలం వికసించినపుడు
నీ మదుర స్మృతి  నిన్ను  బాదిస్తుందా అని అంటోంది చిరుగాలి ! 
ఏకాంతంగా మౌనంగా గుబులు గుబులు గా ఉన్నప్పుడు
నీ తో మాట్లాడాలని ఉందా అని ప్రశ్నిస్తాయి ముంగురులు!
సభలో స్తబ్దత గా ఉంటె ఏ సందడి చేయకుంటే
నీవు లేని లోటు కనపడుతుందా అంటుంది మనోగతం !
ముస్తాబై నీరాకకై   ఎదురుచూస్తున్న వేళ 
నీకు నేను ఒక యుగంలా ఉన్నానా అని కవ్విస్తుంది  నిమిషం !

అన్నింటికీ తెలుసు నాకు నీ మీదున్న ఆప్యాయత
కాని నీకు తెలియదో  ,తెలిసినా మరచావో
ఏది  తేలక ,తెలుసుకోలేక నే సతమవుతున్నా !

నిజం చెప్పవా నేస్తం!
నాకు ఈ తీయటి మాటలకన్నా
చేదుగా ఉన్నా నీవు చెప్పే నిజాన్నే ప్రేమిస్తా!


నిన్న రాత్రి.................
పండు వెన్నెలల పిండారబోసినట్లుంది
ఆ రేయి లో నేను....నా ఏకాంతం
నా లో మెదిలే తన జ్ఞాపకం

ఎవరో   పిలిచినట్టు
ఉలిక్కిపడి పైకి చూసా
ఆ నింగిన జాబిలీ
నా తో మాటలాడుతోంది  
నన్నిలా ప్రేమగా అడగసాగింది

ఎవరు తాను ? ఏమిటా కథ అని?
చెప్పేంత విషయమేమీ లేదని నేనన్నా!

ఎలా ఉంది నీ జీవితం అని?
ఏ ఆరాటం లేని ప్రశాంతత అని నేనన్నా!

ఏమైనా ఈప్సితం  తీర్చనా సఖి అని  ?
ఇచ్చాలోకం కు ఆవల నేనున్నా అని నేనన్నా!

ఎవరినైనా ప్రేమించావా ప్రియా అని?
ఇసుమంతైనా అలాంటి ఊసే లేదని నేనన్నా!

ఏమైనా వంచన తో వగచావా అని?
మచ్చుకైన అలాంటి జ్ఞాపకమే లేదని నేనన్నా!

అప్పుడు తానంది మరి నీకోవిషయం చెప్పనా అని?
చెప్పవమ్మా చల్లనమ్మా అని నేనన్నా!

తను...........చెప్పిందిలా
ఎవరినైతే తలచి వలచావో
తన తోడు నీకు  ఈ గడియన  లేదు కదా...! అని....
నేను..........................................................


ఎన్ని రోజులు ఈ మౌనం
ఇంకెన్ని రోజులు ఈ క్షణ క్షణ మరణం

స్వప్నం సత్యం కాలేదని
తలచి తలచి వగచేవు
సాలోచన దిశ గా
అడుగువేయుట మరిచేవు !

నీవు కోరావని జరగవు అన్నీ
కాదన్నావని ఆగవు కొన్ని
ఆటుపోటుల మిశ్రమం ఈ జీవితం!

ఓటమి లో కూడా చూడు విజయం
ఈ క్షణమిన్తే అని తృప్తి నొంది
గడుపుటయే కదా ఆ క్షణ ఆనందరహస్యం!

కన్నీటి కాలువనందైన
కత్తి  పడవ నడుపుట నేర్చుకో
ముళ్ళబాటలో ముందడుగు వేస్తే
శహబాష్ అని మనసారా నిను నీవు  మెచ్చుకో!

మనసే బలం,మనసే బలహీనత
నీ మనోరాజ్యని మొదట జయించు
సవాలు వేసే సహజలక్షణం తనదైతే
దాని సరదా తీర్చే సత్తా నీది !

కాలాన్ని  బట్టి నడిచేది కొందరు
కాలం తో పోరాడేది కొందరు
కాలాంతం వరకు చరిత లో నిలిచేది ఎందరు!

సువాసన లేని గంధపు చెక్క
రాతిరిన మెరియని నింగిన చుక్క
ఎన్నడు వసి వాడని కుసుమపు రెక్క
కన్నీటికి తడవని చెక్కిలి
సాధ్యమవునా నేస్తమా!

మరెందుకు ఈ తపన
నిశ్శబ్ద నరక యాతన !


శిశిరం లో కొత్త చిగురు వింత కాని
ఆకురాల్చే ఆ సోయగానికి చింత ఏల?

వలచి వచ్చానంటే విభ్రమంకాని 
అపరిచితలా  నిను దాటి వెళ్తే ఈ చిత్తభ్రమ  ఏల ?

ఆ స్వరసంజాత తన పలుకు కులుకు ఆలకించ మందే కాని
ఆ మంజునాధం నీ యధసవ్వడిలా ధ్వనిస్తే ఆ కోమలి దోషమేలా?

కలలు కన్న నీ కనులు
వెర్రెక్కించిన  మది ఊసులు
నిలువలేక ఒర్రుతలూగిన వయస్సు
స్థిమిత బుద్ది మాట చెవినపెట్టకపోతే
హృదయం లేని ప్రియురాలా అని తన పై నిందలేల?

వినకు వెర్రి మనసు మాటలు
రేపును విరహపు వెండిమంటలు
శలభం  లా మాడిపోయేదవు  నేస్తం
శిశిరంలో ఆకులా రాలిపోయేదవు   సమస్తం!

శిశిరం తరవాత వసంతం అనివార్యం
కొత్త చిగురు వచ్చును తధ్యం
కాని రాలిన ఆకు చరిత శూన్యం
అనాలోచిత మోహపు మైకం లో
చేసుకోకు నిర్లిప్తం ఈ క్షణం


ఒంటరిగా ఉన్నవేళ
వేల వేల ప్రశ్నలు
సమాదానం నిశ్శబ్దం
అని తెలిసిన విసిగించే పరిస్థితులు

అల్లారుముద్దుగా పెరిగిన ఆఇంటిని
ఆనందమే నా చిరునామా చేసిన ఆ ఆవరణని 
మూరెడు పసుపుతాడు తో
అరనిమిషంలో చుట్టాన్ని  చేసారు
పండగలకి పబ్బాలకి అతిదిని చేసారు

తప్పటడుగులు  నేర్పిన నాన్న
రెండుపదుల ప్రాయం వరకు
రాకుమారి లా చూసిన నా వాళ్ళు
ఏడడుగుల  తో ఒక్కసారిగా
నన్ను వెళ్ళి రమ్మని పరాయిని చేసారు!

జన్మకు తోడు కలిపామంటూ
జన్మనిచ్చిన వారు ఒక్క ఘడియ లో
అపరిచితవ్యక్తి  చేతిలో నను పెట్టి
జన్మాంతం వారికి నను  దూరం చేసారు !

మీ అమ్మ మీ నాన్న అంటారు తను
కాని మా అత్త మా మామ అనాలి నేను!

కన్నవాళ్ళను చూడ  కావాలి అనుమతులు
మారాలి ఒక్కసారిగా కట్టుబొట్టు మర్యాదలు!

అప్పటివరకు చదువుల  తల్లి   నేను
ఆ క్షణమే అవ్వాలి అపర అన్నపూర్ణ
ఆకతాయి అల్లరి మరచి ,
కొత్త ఇల్లాలి తుళ్ళింత మరచి
అవ్వాలి నేను అరవయి ఏళ్ళ ఆరింద!

ఉన్నమాట అని పదుగురి నోట పడే కన్నా    
చిన్న నవ్వురువ్వి నిన్ను
కాదనుకోమంటుంది  అమ్మ!

మళ్ళి కొత్త జన్మేతినట్లు
అంతా కొత్త అలవాట్లు
కొంగొత్త  అనుభవ పాఠాలు  !

ఇక అదే నీ ఇల్లు
అంటుంది  అమ్మ
కోపమొస్తే మీ ఇంటికి పో
అంటాడు ఆయన!

మరి ఏది నా ఇల్లు ?
ఎవరికీ నే  ముఖ్యం?   

ఈ మీమాంస తేలేలోపు ఇంకోఘట్టం
మాతృ మూర్తి గా పదవీస్వీకారం
అంతులేని సాగరం ఈ జీవనం
భావోద్వేగ అలల పరంపర అనివార్యం ! 


మాటరాని మనసుకు
ఎన్నో ఊసులు
క్షణభంగుర  జీవితానికి
ఎన్నెన్నో సవాళ్ళు

అయినా
కడగల్లు లేని జీవితం
భిందువు లేని సింధువే కదా!
మరెందుకు ఈ వేదన
లోలోపలే  ఉండే ఆవేదన !

మౌనాని సైతం పలికిస్తా
కాని నా స్థితి చెప్పలేక  
మౌనమే నా పలుకైనదే
సరదాకైన నిను మరువలేను  
అని సరాగాలు పాడే హృది కి
నిన్ను మరిచి పోమని ఎలా చెప్పను ?

తాను నా గుండెనడిగినా  
చిరునవ్వుతో ఇస్తానన్నా!
కాని గుండెలేని నీ గూడు
తాను అడుగుతుందనుకొని
అణుమాత్రమైనా అనుకోలేదే !

ఏమి తెలుసు తనకి
నేనిచ్చే రోజా పువ్వు
నా పెదాలపై నవ్వు తప్ప!

నన్ను గా స్వీకరించే
సుమదుర స్నేహం నీవు
నేనింకా  పసివాడినే అనే
బాల్య స్నేహ పరిమళం నీవు
ఏ మాలిన్యం లేని స్నేహ మాలిక నీవు!

వింతగా ఉంది నాకంతా
నా మనసు గెలుచుకున్న
తనకు తెలీదా ఇదంతా?

కాని నా నేస్తమా!
నీపై నిందలు వేసే తనకు
నీ స్నేహమాదుర్యం ఏమి తెలుసు ?
నిను వదులుకోమని నాతో పలికిన ఘడియ  
నాలో రేగిన ఆ పెనుతుఫాను
ఆ ప్రియురాలి హ్రుదయానికేమి తెలుసు ?

ప్రేమ గొప్పదే కాని
అంతా నాదే అన్న స్వార్ధమేమో!
ఆ జవరాలు ఇల్లాలైతే
నా స్నేహభావం తనకు తెలియునేమో ?!

అనురాగమా!
సువిశాల  జగత్తు లో
ఇరుకైన మనుస్సులో
యాంత్రిక జీవన నడవడిక లో
నాకో స్థానం ఇచ్చినందుకు
నీకు కృతజ్ఞత ఎలా తెలపను?
ఆ స్థానం లో నేను ఎప్పటికీ ఉంటానని తెలిసినా
నిను మళ్ళి కలవలేనేమో అనే బెంగ ఎలా వివరించను?




 
 




కన్నా!
నాఒడిలో ఆడుకున్న చిన్నికృష్ణుడివేనా నీవు
వెన్న ముద్దలు తినిపిస్తూ ,పించము పెట్టి
కస్తూరి తిలకము దిద్ది ,మువ్వలు కట్టి
ముస్తాబు చేసిన ముచ్చట ఇంకా తీరనే లేదు!

యదుకులం లో చేసిన అల్లరి
గోపికలు చేసిన ఫిర్యాదులు
ఉట్టి కొట్టి వెన్న దొంగిలించిన వైనాలు
మట్టి తిని విశ్వాన్ని చూపిన చిత్రాలు
ఇంకా ఇప్పుడే జరిగినటుల ఉన్నది కృష్ణా!

ఈ అల్లరి కి నేను నీ పై అలిగితే
అమ్మా అని గారాబం చేస్తూ...
నీ బుజ్జి చేతులతో నా బుగ్గతడిమిన
స్పర్శ ఇంకా నులి వెచ్చగానే ఉంది యదునందనా !

మధుర లో నీవున్న నీ మధుర జ్ఞాపకాలతో
నేను నిత్యం నీతో నే ఉన్న కదా కన్నా!
ఇంత నిడివి లోనే అంత వాడివయ్యావు
యశోదనందనుడు అయిన నా చిన్ని కృష్ణా ,
మదురాధిపతివై,రుక్మిణి కృష్ణుడవయ్యావు!
    
నిన్ను దండించిన ఈ చేతులను
రోటి కి కట్టిన ఈ కఠోర కరములను
నోటి తో ఒక్క మాటైన పలకక
ఇలా నన్ను దండిస్తావా?
ఇది నీకు న్యాయమా  మానస చోరా ?

పదహారు వేల కన్నియలను పెండ్లాడిన
నా ముద్దు కృష్ణుడి   కళ్యాణ కాంతి ని
కన్నులార దర్శించే బాగ్యం లేదే !
కాటిన్యం గా దండించేనని ఈ కరములకు
ఈ కళ్యాణ కిశోరుని ప్రియమార తడిమి
హత్తుకునే అదృష్టం  లేదే !

అనంత కోటి బ్రహ్మాండ నాయక!
ఈ స్త్రీ జన్మ నీ పుత్రవ్యామోహ మహిమ
నాకు నీవు పుత్రుడివే కాని
ఈ విశ్వ నాయకుడిలా చూడలేను!
నను మన్నించి ఈ అమ్మ కు
నీ కళ్యాణ భాగ్యం కలిగించు
మనోహర   మోహనాకారా !






ఆనందపు   సిరులు వికసించే విరుల తోట తాను
రాలిన  పూల సోయగానికే మురిసే  తోట మాలి నేను !
మృదురోహాల భావాల మందస్మిత వదన తాను
ఆ మధుర పవనాల తాకిడికే అల్లాడే చిగురుటాకు నేను!
కావ్యకళను మేల్కొల్పిన కమనీయ కావ్యనాయక  తాను
పడపుష్పలతో అర్చన చేసి కవిగారి ఇంటి కాకి ని నేను!
విధాత తీరికగా చేసిన ముద్దుగుమ్మ తాను
తోచక చేసిన ఓ మట్టి ముద్ద నేను !






కవితకు అందని కల్పనా నీవు
కావ్యం గా రాయలేని భావన నీవు

ఆ  సుస్వరమ విన్నవేళ
నే సర్వస్వం  మరచిపోతాను!
ఆ స్వర ఏలిక స్వరూపం చూడాలని
అడగలేక సతమతమౌతాను!

ఓ మంజుల గానమా !

కలలో మురిపించే నీవు
నాకు కన్నీరు మిగిల్చవు కదా!
కనిపించకనే కలవరం రేపిన నీవు
కలత నిదురల రేయి ని చూపవు కదా!

నను చూసి కరిగిపోమని నేనను
కాని క్షణమైనా నన్నర్థం చేసుకుంటావని ఆశిస్తా!
ఆ ఒక్క క్షణం నాకు ఇవ్వు,అది చాలు సఖి
నేను నీకు నా జీవితమే అర్పిస్తా !








నీ పిలుపు లో ఆప్యాయత
చవి చూసిన మనసుకు
కనులు నిను చూడలేదన్న
ధ్యాస కూడా లేదు!

ఎక్కడివారమో
ఇక్కడ ఒక చోట చేరి
ఎనలేని అనుబందం
పెనవేసుకున్నామనుకున్నా!
అరనిమిషమైన ఆలోచన చేయక
అనుకున్నదేదైన నీ తో చెప్పేసే మనసుకు
అపార్థం చేసుకొని చులకనచేస్తావేమోనన్న
అనుమానం కూడా రాలేదు!
నేను ఇంతే
నా నైజం ఇదే
అదికాదురా అని నీవు
మాటాడే మాటలో
ఒక బాల్య స్నేహం రుచి చూసా!

కలకాలం కలిసి
ఉంటేనే స్నేహం కాదు!
కవితలా చెప్పడానికి
అదో కావ్యం కాదు !
నా  హృదయ భావన
అమ్మ ప్రేమంత స్వచ్చన!
అది ఎప్పటికి నాకు అమూల్యం 


ఏదో వెలితి ఉంది నేస్తం
శూన్యం లోకి చూస్తాను
నాలో నేను రోదిస్తాను
కల్లబొల్లి మాటలతో 
వేదాంతి లా ఒదార్చుకుంటాను

కంటిలో చెమ్మ లేదు
నాది శోకమ అని చెప్పడానికి

బొంది లో శ్వాస  ఆగలేదు
నాది మరణం అని చెప్పడానికి!
నీకై నిద్రాహారాలు మానలేదు
నాది వెర్రి మోహం అని చెప్పడానికి!
నా చేతి లో చెయ్యేసి నువ్వు చెప్పలేదు
బాస మరిచావని నిను నిందించడానికి!
నేను కనులతోనైన సమాదనమివ్వలేదు
బాద్యతల చూసి నీవు భయపడ్డావనడానికి!     
కలిగిన చిన్నఅపోహ తీర్చ నువ్వుచొరవ చేయలేదు
తప్పంతా నాదేనని నన్ను నిలదీసుకోవడానికి!

రోజులు నెలలై,నెలలు సంవత్సరాలైనాయి  
నా జీవన యానం ఏమి స్థంబించలేదు
కాని ......
నీ సహచర్యం లేని లోటు తో
సమూహం లో కూడా ఒంటరినవుతాను
జీవిత గమనం లో ....
దారులు వేరైనా పయనం లో
ఎక్కడున్నావో? ఏమిచేస్తున్నావో?
నా  జ్ఞాపకాలలో నీవు పదిలం
మరి నీవు.............?!






ఓ దైవమా
ధైర్యం చేసి ఓ దిగులును
నీతో విన్నవించుకుంటున్నా
సూటి గా నాలో రగిలే
ప్రశ్నా జ్వాలను నీ ముందుoచుతున్నా

మట్టి కి ప్రాణం పోసి
మమత తో మనసు చేసి
నీ చేతి తో నా తల రాత రాసావే
మనసు కోరే ఆశ,విధి తో
ఎందుకు వివరించలేదు
నా మనసు తపన
నీవు రాసిన రాత
రెండు నీ కల్పితాలే కదా
మరి నన్నెందుకు పావుని చేసావు?

ఒంటరిగా నేనున్నా వేళ 
జంటను నే కోరానా
తుంటరి ఊసులతో
ఎప్పుడైనా నే తల్లడిల్లానా
కావాలని నాకు ఓ జతను ఎంచి
తనతో నాకు జీవితం పంచి
నేడు చిన్న మాట తో ఎడబాటు చేసి
అర్థం కాని వ్యర్థం లా నను మిగిలిచావు
ఇది నీకు భావ్యమా ?

కనకరాసులు నే కోరానా
కలిమిలేమిలలో నే వగచానా
నీవు ఇచ్చిన తోడు
నాకు నీడలా  ఉంటుందని
పసిపాప లా చూసుకుంటుందని
నిర్వాజ్యం గా నమ్మానే తప్ప
నిరంకుశం గా తూలనాడానా?

పుట్టిన నా జన్మకు
పరిపూర్ణత తేవాలని
ఎన్నో విధాలుగా   పరితపిస్తున్న
ఇది మాయ మోహిత జీవనం
ఎక్కడుంది నాకై పరితపించే హృదయం ?

ధైర్యం చేసి చొరవతో  అడుగుతున్నా
నీనిశ్శబ్దంలో సమాధానం వెదుకుతున్నా....   




 




ఈ రాతిరి ఎంతకీ గడవదేమి
పున్నమి వెన్నల కూడా
వేసవి మండుటెండలా మారేనేమి
క్షణమొక యుగమంటే   నేను నవ్వుకున్నా
కాలాన్ని త్వరగా సాగమని నేడు  వెడుతున్నా!

ఎన్ని ఉన్నా ఏదో వెలితి
ఎప్పుడు ఏదో ఒకటి కోరే మనసు
లేదా నాకు మానసిక పరిణితి
లేక ఇది తన ప్రేమ ప్రవాహపు ఉధృతి


బంగారు.. అని తాను పిలిచే పిలుపు
కోటి జన్మలకైనా సరిపడే వలపు
నేను చంటి పాపను కావాలని ఉంది
తన కంటి పాప లో దాగాలని ఉంది

ప్రాణమా!
నిదుర పోనీ ఈ కనులకు చెప్పు
తొలిజాము కలలోకి నీవొస్తావని
గడవని ఈ విరహపు రేయి కి చెప్పు
తొలి ఉషాకిరణంతో నీవొస్తావని

ప్రియా!   ప్రౌడనైనా నాకు ఈ ప్రేమేమిటి?
నీ ఊసులతో,నీ ఊహలతో
నను దహించు ఈ విరహమేమిటి?
నువ్వు ఇలానే ఉన్నావా!
నా పేరే పలవరిస్తున్నావా!



 



అనంతసాగరం  ఈ   ఆలోచన  లోకం
ఒక చోట మునకేస్తే మరో చోట తెలుతావు
మరీ లోతుగా వెళితే మునకే కాని
మరలి వచ్చు  తీరం దారి మరిచిపోతావు
కనుక తస్మాత్ జాగ్రత్త నేస్తం!
ఈ జీవనసాగరాన
భావోద్వేగ అలల అలజడి చూడు
సంద్రపు హోరు పరిశీలించు
విశ్వసాక్షిలా జీవితాన్ని అనుభవించు !




pyasaa dil leke batak raha hoon
manjil paane ko tharas raha hoon
appke ke ankhon me thaa jannath hamaari
phir kyun iss jahanum me phirraha hoon


కోదండరాముడు కౌసల్య రాముడు
సీతామనోభిరాముడికా ఈ దుఃఖం
విశ్వాంతర్యామికా ఈ విషాద వదనం

జనస్థానమైనా వానప్రస్తమైనా
సీత వెంటే రాముడు,రాముడి తోడనే సీత
ఎడబాటు ఈ అశాశ్వత కలేబరానిదే కాని
అనంత ప్రేమది కాదు,
ఆత్మల కలయికకు ఎడబాటు లేదు
కానలకు పంపి నీవెంత కలవరపడ్డావో
నాకు తెలియనిదా ప్రభూ!

అడవిలోనేనున్న,నీఅపారదయతో
లోకపావనినైనాను,మునిపూజితనైనాను
అంతఃపురానానీవున్నా ,
అంతరాత్మ ఎన్ని బోధలు చేసినా
సువర్ణ సీత నీ ఎదుట ఉన్నా
ఈ భూజాత ను మరువలేదని
నాకు తెలీదా స్వామీ !

మన జీవనయానంలో,
మరి ఆ అశ్వమేదయాగంలో
నా లోటుకు ,ఈక్షణిక ఎడబాటు కు
నీ హృదయం దుఖించిన వైనం
పదాలకు అందని ఆ బాదతప్త క్షణం
నీనాకు తెలియనిదా దాశరథి!

లోకం నిన్ను వెర్రి రాముడన్నా
లక్ష్మణ సోదరుడు నినునిలదీసినా
మనోనిబ్బరం చూపిన ఆఅయోధ్యరాముడి
మానససరోవరంలో ఎన్నిఅలలో
కలవరింతలేని రేయిలేదని
నేను ఎరుగనా నాస్వామీ!

వనరాజ్యం,జనరాజ్యం రెండు నీఏలాను
నీమనోబిరాజ్యభిశక్తు రాలినై
సీతమనోభిరామా అని ఖ్యాతి పొందాను
క్షణికము కు నే వగచిన మాట నిజమే
కాని నీఆంతర్యం తెలిసి నీసితప్రజ్ఞనయ్యాను
ఎచటి నుండి వచ్చితినో అచ్చోటికే మరలిపోయేదా!
నామనవి మన్నించు పురుషోత్తమా!


అశాంతి లో ప్రశాంతత వెదుకుతున్నాను
నా నెత్తుటి దారతో పెదవి గులాబీ పూయిస్తున్నాను

మృగతృష్ణ జీవితాన,ఏదో ఒక మజలి లో
ఒయాసిస్సు ఎదురవదా అని ఆశతో అడుగులేస్తున్నాను
హాలాహల నిర్లిప్త సమయాన ,ఏదో ఒక సుదినం
ఒక అమృత గడియ ఎదురవదా అని ఆశ తోఆనందముగా గడిపేస్తున్నాను

చిరుప్రాయం లో యవ్వనం బాగుండాలని అన్ని మరిచాను
యుక్త వయస్సు లో నా జీవనం బాగుండాలని బాద్యతనెరిగాను
ఈ మద్య వయ్యసు లో నా పిల్లల క్షేమం కోరి శ్రమిస్తున్నాను
వ్రుధాప్యం నను హత్తుకోక ముందే నేనేంటో తెలుసుకోవాలని తపిస్తున్నాను

మది నేడు సూటి గా ఒక ప్రశ్న అడుగుతున్నది
అసలు జీవితం అంటే ఎప్పుడని ?
జీవితానికి కి అర్థం ఏమిటని ?

ఉన్న దాన్ని వదిలి ఏదో కోరుకుంటావు
ఈ క్షణం వదిలి రేపటికి పరుగెడతావు
పరిపరి విధాల నీవు భ్రమించి
చిత్త చాంచల్యం తో చిరాకు కొనితేచ్చుకుంటావు
ఫలితం రాక మనసు చిన్నబుచ్చుకుంటావు


మౌనం వీడి అంతరంగం నా తో మాటాడితే
మాట రాక మాటాడ లేక నేను మౌనమయ్యాను !

అశాంతి లో ప్రశాంత త వెదుకుతున్నాను
నా నెత్తుటి దారతో పెదవి గులాబీ పూయిస్తున్నాను


స్ఫూర్తిదాయకం నా జీవనం అవ్వాలని తానంటే
బహుసుందరకావ్యం కావాలని నేనంటాను !

అన్నెం పున్నెం ఎరుగని ఆనందధుని బాల్యం అని తానంటే....
అమ్మ ప్రేమతో ఎన్ని మాయలయినా నే చేస్తానని నేనంటాను !

అడుగడుగునా క్రొత్త సవాలు తో
ముందడుగేయి అని తానంటే....
అందమైన ముఖారవిందందాన్ని
అందలమెక్కిస్తానని నేనంటా !

అరమరికలు లేని అనురాగాజీవితం
కోరుకోసుమీ అని తానంటే......
ఆనంద గడియలె నా ఆనవాళ్లు అనే
ఆరాటమే నా వైఖరి అని నేనంటా!

వయసు తెచ్చిన హుందాతనం తో
హాయిగా ఉండు అని తానంటే....
వయసైపోతుందే అని ఉసూరుమంటూ
కన్నె ఈడు చూసి లోట్టలేస్తానని నేనంటాను!

అనుభవ సాహిత్యంతో ఆదర్శం గా జీవించి
మరుపులేని మనిషి గా మిగిలిపో అని తానంటే..
కృష్ణ రామ అంటూ ఈ కట్టే కాలేదాకా
కాలయాపన చేస్తానని నేనంటా !

ఈ పరస్పర విరుద్ద సంబాషణ
ఇప్పటిది కాదులే ఈ సంఘర్షణ
మొదలైయింది పుట్టిన తక్షణం

తాను మస్తిష్కమై .......
నేను మనసై......
ఒకే మనిషి లో ఇమిడిన క్షణం నుండి.....


నను చూసి నవ్విన క్షణం జీవితం స్వర్గమనుకున్నా
నను కాదని తెలిసిన క్షణం జీవితం నరకమనుకున్నా
తప్పు నీది కాదులే చెలి,తపనపడే నా మనసుది లే
ఆ రెండు క్షణాలే నే జీవితమనుకున్నా...........


నీకంట నీరుంటే
నా చెక్కిలి ఎందుకు తడిసింది
నీ లో ఆలోచన తుఫాను కి
నా మది ఎందుకు బరువెక్కింది
దీని ని ప్రేమ కాక ఏమంటావు
మనం అందరిని ప్రేమిస్తాము
అది మానవ లక్షణం!
అంతే కాని వింత కాదు
ప్రతీ మోహం శాశ్వత ప్రేమ కాదు


కలలుకనే మనసు కు కన్నీళ్లు ఎందుకు
కనే ప్రతీ కల నిజం కావాలని లేదు గా!
నిజాని కి నేను కష్టపడ్డనా అని ఆలోచించడం గొప్ప

నీవు నడిచే దారి సమస్తం
పూల తో ముస్తాబవ్వాలని లేదు గా!
ముళ్ళు ఉన్నా తప్పుకొని నడవడమే గొప్ప

ప్రతినిమిషం విజయకాంక్ష తో
గడిచే నిమిషాన్ని కోల్పోవాలని లేదు గా !
ఏ నిమిషాని కి ఆ నిమిషమే గొప్ప


ఎంతో పని చేసానని అలసాననే నీ మనసుని
ఒక్క మారు అడుగు అలసంటే ఏంటని?
అసలు విశ్రాంతి కి తన నిర్వచనం ఏంటని?

ఒక పని నుండి మరో పని కి మార్పే విశ్రాంతి
నీ పనిని ప్రేమించు ,
గెలుపు ఓటమిల ప్రసక్తి పక్కనపెట్టు
చేసే పని లో ప్రశాంతత వెదుకు
మనసు నిర్మలం అవుతుంది!
జీవితం సంపూర్ణం అవుతుంది!


క్షణక్షణం పరీక్ష లా సాగుతోంది జీవనం
ఏ పద్మవ్యూహం వేచి ఉందొ ఈ క్షణం
సరే మరి ఓ సమయం! చూస్తానులే నీపంతం
నా ఆత్మ బలం ముందు నీ ఓటమి తద్యం
ఎన్ని మార్లు నను గేలి చేసినా నా గెలుపు ఖాయం


చిన్న మర్రి గింజే కదానని ,చులకనగా చిన్నచూపుచూసి
నేల కేసి కొట్టి,ఉక్కు పాదం తో తొక్కితే
ఎంత లోనికి క్రుంగిందో ,అంతే బలం గా లేస్తుంది
శాకోప శాఖలు గా విస్తరించి ఔరా అనిపిస్తుంది !

ఆకాశం నా లక్ష్యము ,శ్రమైక జీవనం నా నైజం
ఏ క్షణం ఆగదు నా పయనం,సహనం నా లక్షణం
శ్రమ నా మార్గం,వివేకం నా అస్త్రం
నా ఆత్మ బలం ముందు నీ ఓటమి తద్యం
ఎన్ని మార్లు నను గేలి చేసినా నా గెలుపు ఖాయం


కనులలోని ఆశాజ్యోతి కనుమరుగు
కానీయకు నా అమూల్య నేస్తం!
ఈ మోహపు తెరల అంధకారం
చాలా దూరం వరకు ఉంది జీవితాన
నేను ఒక బాట సారినే!
నువ్వు ఒక బాటసారివే!
ఏదో ఒక మజలి లో
మళ్ళి కలుస్తాము!
స్నేహపు కాంతి ని
మళ్ళి ప్రసరింపజేదాం
ప్రపంచం చాలా చిన్నది ,
స్నేహం చాలా గొప్పది
నను మరిచి నా......
నా మాట మరువకు నేస్తం !


నీ విరహంతో మది మౌనపీఠం అదిష్టిస్తే
మది లేని ఈ మట్టి చెత్త ఏదో మనుగడ సాగిస్తోంది!
నీ కమ్మని వలపుల తలపులతో.....
నీ ప్రేమ లోకంలో విహంగం లా విహరిస్తోంది
వస్తావు కదూ ! నీ మాటల తో కవ్విస్తావు కదూ ..!


సీతా.....
కఠిన హృదయుడనై నిను కారడవిలో
వదిలి రమ్మని ఆనతిచ్చిన ఆ గడియన
నీ రాముడికి ఆ అయ్యోదాదిపతి కి జరిగిన
ఆ సంఘర్షణ  ఏమని చెప్పను !

నిండుగర్బిని అయిన నా నీలవేణిని 
నిరంకుశముగా అడవిపాలు చేసిన
ఆరఘుకులోత్తముడికి,నీ హృదయరాముడికి
జరిగిన ఆ సంబాషణ ఏమని చెప్పను!

పామరుడు పలికిన అల్పబుద్ది  మాటకి
ఈ కులకాంతను కానలపాలు చేస్తావా అని
మా అమ్మ అడిగిన ప్రశ్నకు సమాదానం ఇవ్వలేని
ఆ కొడుకు మనోవ్యధ ఏమని చెప్పను!
 
అడవిలో నీవున్నా
అంతః పుర జనారణ్యం లో నేనున్నా
నిను నిమిషమైన మరువలేదని
విగతజీవిలా జీవించానని నీకు ఎలా వివరించను!

పుట్టిన పసికందులను పోత్తిలలో హత్తుకొని
ఆ బోసినవ్వుల  ముఖారవిందాన్ని    
ప్రియమార తడమాలని తల్లడిల్లిన
ఓ కన్న తండ్రి తపన ఏమని వివరించను!

అమ్మ సహకారం,అపార  ప్రేమ తో నువ్వు  చేసిన
ఈ ఆదర్శ జీవనయాత్ర లో
రామచంద్రా ! నిను వరించినది యశోకాంతనా     
ఎనలేని ఎడబాటు, ఒంటరితనపు నిశ్శబ్ద ఆవేదన నా
అని నను నిలదీసి అడిగిన మానవుడికి
ఒక భర్త లా ఏమని నిజం చెప్పను!

సీతా..!
పూలు లేని వసంతం
రవి లేని ఉదయం
వెన్నల లేని పున్నమి
నీవు లేని నేను
ఎప్పటికి అసంపూర్ణం
నేను సీతారాముడిని!


ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది

రోజువారి జీవితంలో ఆటవిడుపుగా చేయగలిగినది
చేయాలనే ఆలోచన ఒక అంతర్మదనానికి దారి తీసింది

ఆ క్షణమే బాద్యతనెరిగినట్లు
జీవితంలో క్షణకాలం వెడలి
ఒకపరి రెండు మంచి మాటలు పలికి
పరమదయాలు అని బిరుదాంకితురాలివైన నీవు
మరలి వచ్చు వేళ ఆ చిన్నారి కనులకు
ఏమని బదులు చెప్పావు?

ఒక ప్రశ్న శరం నన్ను బ్రహ్మస్త్రమై తాకింది
కుంటి సాకులు చెపితే మోహం నిస్త్రానమయింది!

ఎవరికీ ఎవరు ఏమి కాని ఈ లోకాన
తాను అనాధనని తనకే తెలీని అలౌకిక ప్రయాణ
రెండు బన్ను ముక్కలిచ్చిన నిన్ను
ప్రియమార తడిమిన ఆ లేత చేతులకు
ఏమని బాస చేసి వచ్చావు?

ఆలోచన తరంగం ఉప్పెనలా నన్ను అలుముకుంది
మాటవరసకు కూడా జవాబు చెప్పలేని మనసు మూగపోయింది!

ఆ బోసినవ్వుల మోమును,ముదమార తాకితే
ఆ ప్రేమ తనకు శాశ్వతమనుకొని
స్వచమైన ప్రేమ తో ఆ లేత మనసు
నీ చెక్కిలి పై చేసిన మదుర సంతకానికి
ఏమని రాసిచ్చి వచ్చావు?

ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది


చాలా రోజులయింది నేస్తం
ఇలా నిదురలేని రాతిరి గడిపి
నీ స్నేహపు చిరుజల్లు లో తడిసి
నిను మరచిపోయానని అనలేను
మరవడానికి నేవో జ్ఞాపకం కాదు
నా జీవితం లో భాగం నీవు...

ఆ హాస్టల్ ఆవరణ,కాంటీన్ లో చేసిన అల్లరి
మన సుబ్బిగాడి తో దోశల కోసం చేసిన రగడ
తోట లోని గులాబీలన్ని నాకే సొంతం అని నీవు చేసిన బీభత్సం
నా కురుల అలంకరించ నీవు నాటిన ఆ మల్లెపాదు
ఇప్పుడు అక్కడ పూలు పూస్తుందో లేదో కాని ,
విజ్జీ...!వాటి పరిమళం మాత్రం నను తాకుతూనే ఉంది

నేనెవరని నను అంతగా ప్రేమించావు?

నాకోసం నువ్వు చేసిన పార్ట్ టైం జాబులు
నా రిజల్ట్స్ కి మనం చేసుకున్న పానిపురి పార్టీలు
న్యూ ఇయర్ సంబరాలు,
మెస్ బిల్లులతో వేసుకున్న బోగి మంటలు
హోలీ లో నన్ను సప్తవర్ణాలతో ముంచెత్తి
ముచ్చటపడిన తీరూ,దోభి గాటు లో మన కూనిరాగాలు
గప్పాలు కొడుతూ ,వెన్నెల్లో పాటలు పడుతూ
స్నేహజీవితం అందం అని నీవు చెప్పిన తీరూ!

ఏమని చెప్పను కుట్టి!
ప్రేమని చెప్పడానికి నాకు సంశయం లేదు
కాని ప్రపంచానికి తెలిసింది ఆడ మగా ప్రేమే..!
అయినా ఆ చిన్న పదం నీకు నే ఆపాదించలేను

నాలో అంత వింతేమి ఉందో ఇప్పటికి నాకు తెలీదు
నీతో ఉన్న ప్రతీ క్షణం ప్రేమ తప్ప మరోటి నేను చూడలేదు
అన్నిటికి కొసమెరుపుగా నువ్వు నన్ను అమ్మా అని పిలిచే పిలుపు
అన్నీ నువ్వు చేస్తూ..
కంటికి రెప్పల ప్రేమిస్తూ..
నేను నీ అమ్మ నని సంబోధించావే
ఏమి చేసాను రా నీకు
ఓ రెండు ఓదార్పు మాటలు తప్ప!
నీకు నేను అమూల్యం అంటావు ఇప్పటికి
కాని నేస్తం నువ్వు నా జీవితం లో ఓ సువర్ణాక్షరం
దేవుడిచ్చిన అత్యంత ప్రీతీ కరమైన వరం
సఖి !నీ స్నేహం మధురాతి మధురం!
I MISS U RAA















Pyar tho woh hai,zo kho ke bhi miljathi hai
Pyar tho woh nasha hai,zo uthar ke bhi chadjathi hai

hum tho bole,mauth manjoor hai
lekin yaar ki judai manjoor nahi

Pass hoke bhi dhoor rahathe ho
hame beed me bhi thanha karthe ho
yeh pyar! tu istharaha unhe bhi azmana
woh jab ayeena dekhe bass hum hi unhe nazhar anna


jidh na karo tuffa ko baho me lene ki
jidh na karo ghane doop me chandani rath ki
jidh na karo iss beraham dil se use bool ne ki
jidh na karo hey dil,uss ki dil me rehane ki


pyaar bare woh lamhe hume abh dardh dethi hai
phir bhi unlamhon se pyyar hai

unki ek labaz ne hume gayal kar diya hai
phir bhi unki bathe hame pyyari hai

woh hamra hal poochna hi choodiye
phir bhi unki naarazgi hume pyyari hai


reth me paani doondthe nikhle
Beerane me bahaar doondthe nikhle
bath karne ki pursath hi nahi jinko
unko hum pyaar ki kisse sunnaye

hey dil lalath hai thum pe
hasthe hai thumhari bachpana se
bool nahi sakthi woh teri majboori hai
baar baar usse hi chahe yeh teri kamjoori hai
nachne walon ki nahi hai duniya nachane walon ki hai
pyaar paane walon ki hi nahi pyaar dene walon ki hai


hamne usske gusse ko bhi hasthe saha li
par ussne hamari bebasi jo bhi na samjpaye

Deedar ke liye tharas rahe they hum
woh yadh karne ki gusthaki bhi na kar paye

kabhi unko bhi hum se pyaar thaa
yeh bath izhaar bhi woh kar na paye

kyun hum thume ithna chahe
jo hame dekhna bhi na chahe
dil kahe woh aissa hai hum kya kare
dil tho dil hai,photo fram nahi
jo har lamha thasveer badla kare


socthe ho ki thum jeeth gaye
kyun bolaki hum haar gaye
hum tho hum hai
jo haar karke bhi jeeth gaye

soch the ho ki hum se door gaye
lekin yadhon se kha bagoge thum
jo dil me hai usse kaise bool pavoge thum


judha hoke bhi pass agye hai hum
haar ke bhi jeeth gaye hai hum


samandhar hai hamare pass lekin
ek boondh ki pyase hai hum

sawan hai hamare pass lekin
unki nazaron ki bhar keliye bekarar hai hum


hum ne gham liye bolthe hai sabh
thum me gum huwe bolthe hai hum

kathre bar ki pahale boondi ki pyasi hoon mai
unse nazar milanke liye saas lethi hoon mai


Bina machli ki samundhar
Bina tharon ki raath
Bin teri kyal ka woh lamha
laye tho kaha se laye


Yaar! lakh kosish kare
isse sheese ke dil se thumhe nikaalne ko
najaane kabh yeh tasveer bangaya

jabhi chale the dil se thumhe bulane
lekin waha bhi thumhare apsaane hi gungunaye


ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో
గగన విహంగానై వెను దిరిగి చూడక
లక్ష్య బట లో వాడి వాడి గా అడుగులేసాను

లక్షణమైన లక్షణాలన్నీ పూసగ్రుచ్చి
ఆశయాసదనలో అన్ని నే మరిచాను
ఎంత ఎత్తెదిగినా ఒదిగే ఉన్నాను
ఒదిగితే ఎదురు ఉండదనే నీతి నే నమ్మాను

గాలివానకి తాటి చెట్టు కూలును కాని
తుమ్మ కొమ్మ లోని చిన్న రేమ్మైన రాలునా
సమయానికి తగు ఆలోచనుంటే
సమస్య ఏదైనా ఉండునా!

ఎవ్వరితో పోల్చినా ఎందరు పోటిపడినా
నాదంటూ చెరగని ముద్రతో నే ముందుకే నడిచాను!

సాటి రాని ప్రతిభ, దీటు లేని పలుకు
నా మారుపేరు గా ప్రశంస పొందాను
ప్రశంస కు పొంగక విమర్శ కు లొంగక
నేనంటే నేనేనని నలుగురి హృదయపీఠం అలంకరించాను!

సవాలు చేసి నే నిలబడితే
ఏ సమస్యైనా పారిపోదా
శివాలెత్తిన నన్ను చూస్తే
ఓటమైన లొంగి పోదా !

మరి...
మరి నేననే నేనెవరు ?

నేను...
నేను....
నేను నీ సంకల్పబలం
దొంగలు దోచలేని ధనం
ప్రతికూల పరిస్థితి లో శివుడి శూలం
నేను నీ ఆత్మబలం

మరి నేనున్నానా నీకు ?

నేనున్న నీవెలా ఉండాలో కాస్త ఆలోచించు!
నీ నేనైనందుకు నాకు సంతసం అందించు !


కన్నీటి దొంతరలో గతం ఎన్ని సార్లు గుర్తు చేసుకున్న
ఒంటరిగా ఎన్ని సార్లు నీ యదను ఒదార్చుకున్నా
గతం తిరిగి రాదు,భవితవ్యం మార్చి రాయదు
ప్రతి అనుభవం ఒక చక్కని పథం
సువర్ణ జీవితానికి ఒక సోపానం

మనసు మంచిది నేస్తం
ఒకసారి దాని మాట వినిచూడు
ఉద్వేగాల తరంగాలని సాక్షి ల చూడు
ఆవేశం తో అలలు ఉవ్వెత్తున లేచి
నిదానం అవుతాయి,ప్రశాంతతనిస్తాయి.
గతం తలచి వగచే కన్నా
లిప్తముకైన చిరునగవుతో జీవించుట మిన్నా


ఏమవుతుంది నా జీవితం
ఎటు వైపు ఈ పయనం
ఏమిటో ఆపైవాడి అభిమతం

బాల్యం ఆ బుడిబుడి నడకలు
అమ్మవోడి అటునుండి వడివడి గా బడి
అక్షరమాల వచ్చింది అనేలోపు మరో ముందడుగు

ఈ మలుపు లో ఏ తీర్పు ఉందో
ఆ తీర్పు లో ఈ మార్పు ఉందో

అల్లరి ఆటలు,ప్రేమ ఊసులు
యవ్వనం వచ్చేసిందన్నకొంగోత్తభావం
ఆశలు ఆశయాలు గ మారే తరుణం

ఈ మలుపు లో ఏ పిలుపు ఉందో
ఆ పిలుపు లో ఈ గెలుపు ఉందో

ఉద్యోగం లో నూతన ఉత్సాహం
సంసారనౌక లో తొలి ప్రయాణం
ప్రతి పిలుపు వలపు నాదే నన్నభావం

ఈ పిలుపు లో ఏ మధురిమ ఉందో
ఆ మధురిమ లో ఏ తంత్రం ఉందో

జనని జనక స్థానం
అదో సుందర అనుభవం
మరో సారి మనకు బాల్యం

ఆ బాల్యం లో ఏ భావం ఉందో
ఈ భావం లో ఏ బాధ్యత ఉందో

అంతు లేని అనంత సాగరం
అనాది గా ఇంతేనా జీవితం
ఎన్ని ఉన్నా ఏదో కావాలి
ప్రతి బంధం లో ప్రేమ కావాలి
ఏమిటీ స్వార్థం ,ఎందుకీ వెర్రి వ్యామోహం ?

ఏమిటో ఈ జీవితం
ఎటు వైపు ఈ పయనం


నీవు లేవని నిదుర రాని ఈ కన్నులకి
కలలో వస్తానని మాట ఈయలేవా
నీ చెంత చేరిన నా మనసుకు
ఓ మంచి మాట చెప్పలేవా !
నువ్వు వస్తావని........



++++++ Missing u+++++++


సంద్రం లోని కెరటం
నింగి లోని జాబిలి
గగనం లోని విహంగం
శ్వేతపుష్పం లాంటి మేఘం
ఇలా సృష్టి సౌందర్యాలన్ని కలబోసినా
నీహృదయ సౌందర్యానికి సాటిరావు
సర్వసుందరమైన నీమనసుకు
నా జీవితం అర్పితం


ఎవరు నీవు ఎవరు నీవు
నా మాటే పలుకుతావు
జాబిలమ్మ నీవంటూ
కథలెన్నో అల్లుతావు
ప్రతినిమిషం నాతో
ఏదో పేచి పెడతావ్
ఎవరు నీవు ఎవరు నీవు
నా నవ్వులా మారిపోయావు


నీ కవితలా మారిన నేను
కన్నీరొలికితే రాను నేను
నిజం గా మారాలనుకునే నేను
నీ క్షణిక కలలా రాలేను నేను
మౌనం కు బాష్యం చెప్పే
బాష నీకు తెలుసు
స్వాతిచినుకు కై వేచే
చకోరి లోని ఓర్పు నీకు తెలుసు
అన్ని తెలిసిన నీవే
ఇలా అంటే ఎలా నేస్తం
ప్రాణాలను కోరేంత
స్వార్థం నాది కాదు
నీ చేరువ వదులుకునేoత
తెగువ నాకు లేదు
పంజరం లో ని చిలకను నేను
స్వేఛ్ఛా గగనపు విహంగం నీవు


కాదన్నాను కానీ.....
నువ్వంటే నాకు అసలు ఇష్టంలేదు
సరే మరెందుకు నీకై వెతుకుతాను!

నీ మీద అసలు నాకు ధ్యాస లేదు
మరి కనపడకుంటే కంగారెందుకు పడతాను!

నేనన్నట్లు అసలు నీ గమనంకు నా గమ్యంకు పొంతన లేదు
మరి నా దారి లో నీ సహచర్యం వద్దన్నానే అని ఎందుకు చింతిస్తాను !

నీవంటే అసలు నాకు ప్రేమే లేదు
మరి పదే పదే నీ పేరెందుకు పలవరిస్తాను!

నీ మనోగతం చెప్పి నీవు ప్రశాంతమైయ్యావు
నే చెప్పింది నామనోగతం అని నమ్మించ నేను సతమతమవుతున్నా!


ఆకాశం నీ హద్దు
ఏ అవకాశం వదలొద్దు !
విజయం ఊపిరిలా జీవించు!
ప్రతి క్షణం సాధన లో పరవశించు!

====== U CAN DO IT ======


అరచేతి తో అరుణ కిరణం ఆపలేరు
కడవలో కడలిని బందించలేరు
పడి లేచిన కెరటానివి నీవు
ఇక నీకు ఎదురు లేదు
పద ముందుకు, ఓటమిని ఓడించేందుకు ....


{}{}{} ALL THE BEST {}{}{}


కనులలోని చెమ్మ నేను మదన పడుతున్ననంటూంది
మది లోని మాట నీ జాతికిది కొత్తేమి కాదంటుంది

వేదన శోధన నాకేనా అని బేల గా నేనడిగితే
ఒక్కసారి చరిత్ర పుటలు వెనక్కి తిప్పి చూడు
వేదాంతవేత్తలైన ,పండితపామరులైన ఎరుగనిదా ఇది
నీదో ఒక పెద్ద కష్టమా అంటూంది

గువ్వ హాయి గా ఉంది,పువ్వు హాయి గా ఉంది
మరి నాకేల ఈ మోహం అనినేనడిగితే
మనసు మేధా రెండు ఉన్న ప్రాణి వి
మాటకారితనం తో దేవుడి నే దోషి అనే జ్ఞానివి
అని వింతగా ఉన్న నిజం చెపుతుంది

తపనే పడే హృదయం తలడిల్లి మరల మాయనే
ఎందుకు పదే పదే మోహించునంటే,
మదన మోహన రూపమైన విశ్వాంతర్యామిని
చూసే నీ కన్నులు భామినుల సోయగముకై
అర్రులు చాచి వెర్రెక్కి పోయినవే అని వాపోయింది

ఎన్ని తర్కాలు చేసినా,ఎన్ని కబురులు చెప్పినా
కఠోర సత్యం ముందు నిలబడునా?

కాలం చెప్పిన సత్యం
అంతరాత్మ చెప్పిన మార్గం
తెలుసుకొని మసలుట మనధర్మం
భవసాగారాన్ని దాటలేక,తీరము కానరాక
కొట్టుమిట్టాడుతున్న అలిసిన మనసుకు
మౌనం, శూన్యం చెప్పిన మంచి మాట ఇది
తెలుసుకొని మసలుకో,ప్రశాంతతను హత్తుకో


నీకంట నీరుంటే
నా చెక్కిలి ఎందుకు తడిసింది
నీ లో ఆలోచన తుఫాను కి
నా మది ఎందుకు బరువెక్కింది
దీని ని ప్రేమ కాక ఏమంటావు?
మనం అందరిని ప్రేమిస్తాము
అది మానవ లక్షణం! అంతే కాని వింత కాదు
ప్రతీ మోహం శాశ్వత ప్రేమ కాదు.


యద మాటున దాగిన ఎన్నెనో రాగాలు
నీ పెదవి పల్లవి నందుకోవాల్సిన ఎన్నెన్నో స్వరాలు
స్తబ్దము గా మదివీన మూగబోయి ఉన్నదీ
నా స్వరకర్త వి నీవేనని తెలుపవేమన్నది

నీ జ్ఞాపకాలతో కనులకి కనీరోస్తే
కనుపాపలో దాగిన నీవు కరుగుతవేమో నని
మదుర బాధనే కదానని నను నవ్వమంటుంది

పువ్వులో సుకుమారం
శ్రావనసంద్య లోని ఆహ్లాదం
సిరిచందనం లోని చల్లదనం
ఇలా ఏది చూసిన నీవని నేను భ్రమిస్తే

యద వింతగా నను చూసి నవ్వుతోంది
అర్థం కాని ఈ వ్యాదికి మందు నీవని అంటోంది

కలలోకి రాగా నేను దేవకాంత కాను
నీకు దాసోహం అన మరీ అంత సాద్విని కాను!

పిండి వెన్నేల పరచే చందమామతో కబురులు చెబుతూ
నింగి నుండి నను నిన్ను చూస్తుందని మురుసిపోతాను
గాలిలో అగరు ధూపాలు వెదజల్లుతూ
నీకోసం సమీరాని ముస్తాబు చేస్తాను
ఈ నా పుడమి తల్లిని పూజించి
నీ పాదదూళి నాకై దాచమంటాను !

అందరు నాకు పిచ్చి అంటారు
నేను నీపై ప్రేమా అంటాను
నీవేమంటావో వినడానికి వేచి ఉన్నాను !


పుష్పం నేను నవవసంతం నేను
విహంగం నేను వినువీది నేను
నీ ఆలోచన నేను నీ ప్రపంచం నేను

నేను లేని నువ్వు ఉన్నావా!
నువ్వే నేనై నేనున్నానా!

ఆలోచన తరంగం నేను
ఆటుపోటుల జీవనం నేను
నీ యద బాధ కు కన్నీరోలుకు నయనం నేను
మది మృదురోహాల భావాల నిశ్శబ్ద కవ్వింపు నేను

నీ కనులలో నేను ఉన్నానా !
లేక నేనే నీ కన్నులయ్యానా !

రేయి నేను,పగలు నేను
నిన్న నేను నేడు నేను
నీ హృదయ శబ్దం నేను
నీ నిశ్శబ్దానికే అర్థం నేను

నా స్పర్శ తో నీవు చలితం అయ్యావా
నీ చలనం తో నే ప్రజ్వలం అయ్యానా

ఎవరు నేను ఎవరు నేను
నీకై నేను ఎందుకు వేచాను!
నీ చిరునవ్వుని చూసి ఇలా బ్రతికేస్తున్నాను!

నా సర్వస్వం నీవని,
నీకన్నీ నేనని గాలితో ఊసులాడుతున్నాను


నను చూసి నవ్విన క్షణం జీవితం స్వర్గమనుకున్నా
నను కాదని తెలిసిన క్షణం జీవితం నరకమనుకున్నా
తప్పు నీది కాదులే చెలి,తపనపడే నా మనసుది లే
ఆ రెండు క్షణాలే నే జీవితమనుకున్నా...........!


తీరాన ఉన్న నాకు కెరటాలే తెలుసు కాని
అవి తెచ్చే గవ్వల సొగసు చూసి మురుస్తాను కాని
ఆ నీలాల సంద్ర గర్భమున దాగిన ముత్యమెలా తెలుసు!

మాటలతో కోటలు కట్టే నాకు
నీ మౌనం వినే శక్తి ఎక్కడ ఉంది!

క్షమించమని అడిగేంత తప్పు చేసినా
నేనలా అడిగితే వచ్చే నీ కంటి చెమ్మ నే చూడలేను!

నా అనురాగానికి అర్థం నీవు
జీవితానికి అమృతం నీవు
క్షమాపణ కోరి నిను ఏడిపించ లేను కాని
నేను నీ హృదయ సవ్వడిలా జీవిస్తానని మాట ఇవ్వగలను సఖి !


నా మాటల ఆవేశ కెరటాలే తెలుసు తనకు
సంద్రమంత లోతైన మనసు తెలీదే

కనపడే కన్నీరే అశుభమని తెలుసు తనకి
ఏర్పడని మది మరణం తనకి తెలీదే

తనని వద్దన్నాననే తెలుసు తనకి
తను లేని ఈ లోకం నాకెంత నరకమో తనకు తెలీదే

పువ్వులు,నా నవ్వులే తెలుసు తనకి
నా మది పువ్వుకన్నా మృదువని తనకి తెలీదే

నా స్వాభిమానం అహంకారమనే తెలుసు తనకి
తానే నన్ను అంటే తట్టుకోలేనంత అనురాగమని తనకి తెలీదే

మాటలతో నా అస్తిత్వాన్ని అంచనా వేయడం తెలుసు తనకి
నా మౌనం చెప్పే మాటలు నిగూడార్దాలు తనకి తెలీదే

ఎందుకిలా జరుగుతుంది?
నాతోనే ఇలాజరుగుతోందా?
ఏమిటి ఈ పరిస్థితి?
నాకెందుకు ఈ దుస్థితి ?


కన్నురేప్పలు భారము తో వాలిపోతూ..
కునకుతీయ కదలవేమని కోరుతున్నవి
అలిసిన సోలసిన మేను హాయి కోరి
నిదుర కౌగిలి ముదమారా చేరమన్నది
ఈ రేయి గడవనిది మరో రోజేది
అన్ని మరచి హాయిగా నిదురపో

^^^^^^GOOD NIGHT^^^^^^


అమ్మ చేతి గోరుముద్ద తీపి జ్ఞాపకమైంది
తను చేసే సున్నుండ అపురూపమైనది

గుడిలో ప్రసాదాని కై పడిగాపులు
అయ్యగారి పిలక మీద చిలిపి కూతలు
అమ్మ తో కొత్త బట్టలకి సిఫారసులు
నాన్నకు చెప్పకుండా దొంగ చాటు సినిమాలు

గుట్టు రట్టయిన వేళ అమ్మ కొంగు నా చైనా వాలు

వేసవి సెలవులలో తాటి ముంజలకై తిప్పలు
పుల్ల ఐస్ క్రీములకై అగచాట్లు, అమ్మ పెట్టె తీపి చీవాట్లు,
అపురూపం మా అమ్మ,మనసు హిమశికరము కన్నా మిన్న
సృష్టి లోని ప్రేమానంతా రంగరించి రూపమిస్తే తను మా అమ్మ

ఎంత ఎదిగినా నీకు నీ బిడ్డనే అమ్మా !
నీ చేతి గోరుముద్దకై ఆకలితో ఉన్న
ఈ నగరజీవితం లో ఏకాకినవుతున్నా!
మన పల్లె మన ఇల్లు ఎంత గుర్తోస్తున్న
నీ కల నా ఆశయమై నన్ను నడిపుస్తున్నా
అమ్మా! నేనేదో మరిచానమ్మ!
నేనేదో విడిచి వచ్చానమ్మా !

వెతుకుతున్న ఎవరికీఎవరుఏమి కాని ఈ జనారణ్యంలో
ఎక్కడైనా మా అమ్మ ప్రేమ చవిచూస్తానేమోనని
నీకు సాటి నీవే నమ్మా ! నా చక్కని స్నేహితురాలివమ్మా !
నా మనో శక్తి నీవమ్మా !నీ సైన్యం నేనమ్మా !
నీ చిరు నవ్వు కై నేను శ్రమిస్తున్నానమ్మ !
మరుజన్మ కైనా నీవే కావాలి నా బంగారుఅమ్మ !


అలిసిన అరవిందం ముడుచుకొని బజ్జుంది
శశిచూడ కలువ కన్నులు విపార్చింది
కలలోకి రాగా నీచేలియ వేచి ఉంది
కనులు మూసి కలికముకి పనులు కట్టి పెట్టు
తారాలోకం తో ఈ జాము జత కట్టు

********GOOD NIGHT*********


నీ అందం మకరందమయితే
నా హృది బృందావనం
నీవు కుసుమ పారిజాతమైతే
నే మత్తెక్కి తిరిగే భ్రమరం
ఈ తుమ్మేదకి మరో పూవు తెలీదు
నా మనుసుకు మరో ధ్యాస లేదు


పువ్వుకి పరిమళం నీవు
హాస్యానికి లాస్యం నీవు
నా జీవితానికి వెలుగు నీవు
మృగతృష్ణ మనసుకు
ప్రేమాంబుదినిచ్చే మేఘమాలిక నీవు
హృదయావిష్కరణ ను వట్టి మాటలంటావు
మాటలాడక పోతే మౌనం ఎందుకంటావు
అల్లిబిల్లి ఊసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తావు
అలక అయిన ఒక కులుకే నీది
అర నిమిషమైనా విడవలేని మొహం నాది !


పంచభూతాలు పంచ ప్రాణాలు
ఏది విషమించిన చిన్నా ప్రాణం
రెప రెప లాడుతుంది గాలి లో దీపంలా...

పంచేద్రియాలు పంచతన్మాత్రలు
ఎన్ని మొక్కులు మొక్కినా
పాపపంకిల లోకానికి తప్పదు పతనం

సృష్టి కర్త నాకందరూ సములంటే
ధన బలంతో నే గొప్ప అన్నారే !
ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారే!
ఆ ఈశ్వరుడి ఒక జవాను విజ్రుంబిస్తే ...
పేదవాడి పక్కనే అన్నమో రామచంద్ర అంటున్నారే !

పొరుగింటిలో కన్నీరు కృష్ణలా ప్రవహిస్తే
నాకెందుకులెమ్మని గుండె కు కంచు కోటలు కట్టారే !
సాటి మనిషి సాయం అని చేజాస్తే ...
బలహీనుడని ఉక్కుపాదం మోపారే !

కృష్ణమ్మా కన్నెర్ర జేసింది
కడలి అందరిని తనలో కలపమంది
పేదవాడి అత్మగోష అంబరాన్ని అంటింది
ఉసురు ఉరుమై వ్యధ వరదై
అందరిని ఏక మట్టం చేసింది
అమాయకులనీ బలిగొంది
సమర్ధుడి మౌనం,
ఎన్నో ఘోరాలకు కారణం

మరో మారు....
హృదయవిశాలతకు అవకాశం
ఆపన్నులను ఆదుకునే తరుణం
మేలుకో ! సాటి జీవమా !
మనిషి అనే బిరుదు అందుకో
సృష్టిలోని అధ్బుత ప్రాణమా !

జనం మనం,మనం జనం
ఏకమైతే ప్రభంజనం
మరణపు అంచున ఈ పయనం
ఇక కులమేది,వర్గమేది
ధనమేది,దారిద్ర్యంఏది ?
ఉంది ఒకే కులం,మానవకులం
మా నవకులం


చుక్కలు విసుగెత్తి అలిగి కూర్చున్నాయి
చందమామ నీ కంటికి కునకు రాలేదేమని
తన జవరాలిని పదే పదే అడుగుతున్నాడు
ఒక నిశాచారి నిదురపోనీయలేదని నాపై నిందలేస్తున్నారు
అరుణకిరణం నన్ను కసరక ముందే నిదురపో నా అమూల్య నేస్తమా!

******* GOOD NIGHT *******


గువ్వలు నిదురించే వేళ
జాబిలమ్మ జోల పాడు వేళ
కలలోకి రంభ ఊర్వసులు వచ్చు వేళ
నీవు గాడ నిదురపో
కొత్త ఆశల రేపుకి తెర తీయి

ఇక చాలు లే పడుకో ! good night


క్షణం ఒక యుగం
నీవు లేని ప్రపంచం
నాకు శూన్యం తో సమానం
నీవు నా చెంత ఉన్న వేళ
అంబరాన్ని అంటే సంబరం నాది
నీ ఆశకు నే శ్వాసనవుతా
నీ కల నాదైతే,
నా విజయం నీదవుతుంది
నీ ప్రతి అడుగు లో నేనున్నాను!
YOU ARE NOT ALONE IN THIS JOURNEY


నీ మనసు శీతల సంద్రం అయితే
అందులో ఎక్కడో దాగే ముత్యం అవుతా !

నీవు పచ్చని పంట పోలానివైతే
చిరు చినుకల తో కౌగలించుకునే చిరుజల్లు అవుతా !

నిదురించేపుడు జోల అవుతా
అలసిన హృదయానికి ఓదార్పును అవుతా!

నీది ఆకాశ గమనం అయితే
నేను నింగి లోని తారల లోకం అవుతా
తారలలో నను వెదకకు నేస్తం
నీ కోరిక తీర్చే తెగిపడే చుక్కను అవుతా !

నీ ఆనందం కోసం నిన్ను మరచి
నేను మరో నేను అవుతా !


నీది కాని నింగి కి ఎగరాలనే నీ ఆశ
నేల విడిచి సాము చేసే నీ పటిమ
వ్యర్థం కాకూడదు నేస్తం
కలలు కనే కన్నులో కన్నీరు చూడలేను
కురులలోని పుష్పం పూజకు వాడలేను
మరపు సహజం,నను మరచి
శిలనుండి సజీవత పొంది
జీవన సప్తస్వరాలు ఆస్వాదించాలని కోరుతూ ...


I am urs for ever

నా గాజుల సవ్వడిలో నీవు
నా అధరసుధలు గ్రోలేది నీవు
నా గహరాన ఇనబింబం నీవు
నా కంఠం పలికే మధురం స్వరం నీవు
అన్ని నీవై,నీ నేను నేనై.....
నీ వలపుల తలపులతో ....
తుంటరి చేష్టలు చేసే నీ ఊసులతో ...
ప్రియా ఏకాంతం లో కూడా
ఒంటరిని కాను నేను.....


కమ్మనికలలు నీ గుమ్మం లో కలబోసి ఉంచాను
కలం,కాగితం ఇక నిను ఇంటికి వెళ్ళమన్నాయీ
గువ్వలు కూడా గూళ్ళు చేరుకున్నాయి
నీ కోసం స్వప్న ద్వారాలు తెరిచిఉన్నాయీ
ఆదమరిచి నిదురపో!,పసిపాపల మారిపో!


చుక్కల తివాచి వేసి
మేఘాల పరుపుపరచాను
అలసి సొలసిన నీ మేనుకు
నిదురమ్మను ఆహ్వానించాను
తీపికలల ఒడిలో నిను చేర్చుకొని
ప్రశాంతంత నిచ్చే పురి కి చేర్చమన్నాను
జో జో........ జో జో....


మోడైన మావి మళ్ళి చిగురిస్తుంది
ఎడారిలో నీరు అమృతం అవుతుంది
నిరాశ నిండిన యదలోనే ఆశ ఉద్భవిస్తుంది
గెలుపుపై తుదిలేని కాంక్ష
నీ విజయ సాధనకు శ్రీరామరక్ష !


ఆశయ సాధనలో అన్ని మరచి
అర్జునలక్ష్యం లా గమ్యానే తలచి
మునుముందుకు సాగు మిత్రమా
అలుపెరుగని యోధుడిలా!


నీ కంటి చెమ్మ,నే చూడలేకున్న
ఏకాంతం లో నేస్తమై నేనున్నా
ఏ చోట నీవున్నా! నా అనురాగం అనుకున్న
కోటి ఆశలతో నిను చూడనేవస్తే
కుసుమపు సిరి నవుల బదలు పుష్పవిలాపం చూస్తున్న
చెలి ఏచోట నేనున్నా నీ సుఖమే నే కోరుకున్న
ఈ క్షణము కూడా నిను నే ప్రేమిస్తున్నా ........


దశ దిశల పెను సవాళ్ళు ఒక్కసారి ననుకమ్ముకున్న
తొణకని తలోగ్గని గుండె నిబ్బరం నాది
తొలకరి జల్లు తో పుడమిని తడిపిన వరుణుడి తపన నాది
తిమిరం లో తూరుపు వేకువ ను ప్రసరించే బానుడి కిరణం నేను
కమ్మని తలపు నేను,ఆశల హరివిల్లునేను
కవి నేను,రవి నేను,నిన్ను కవ్వించే సరి జోడు నేను
నేను క్రాంతి ని నేను ఆత్మ శాంతి ని
నేనెవరు అనే ప్రశ్న ఉధయించేవరకు
నేనొక మోహపు తెరల వయ్యారి నేను
ఆ అజ్ఞానం వీడితే ఆత్మ బంధువు నేను
వివేకం తో జీవించు,స్నేహం తో విశ్వం జయించు


అధరము పై చెరగని దరహాసము
కనుపాపలలో తెలియని అనురాగాపువర్షము
తనకోసమే నేను అనే అపారనమ్మకం
పసిపాపల బోసి నవ్వులో ఉండే హాయీ
పరిచయం చేసిన నీ ప్రేమని
ఏమని చెప్పగలను ? ఎలా వివరించను?
ప్రేమకు నిర్వచనం చెప్పగలవానోయీ
అద్వితీయం ఆ భావన
ఇది ప్రతి మది ఆలాపన


చిరుగాలికి ముంగురులు సయాటలాడే వేళ
సనజాజుల పరిమళం యదసవ్వడి పెంచే వేళ
ఇంటివాకిట చుక్కలు చిరుదివ్వెలు వెలిగించే వేళ
నెలవంక నా విరహాని వెక్కిరించే వేళ
నీవు రాలేదేమని మది బేల గా అడుగుతుంది ప్రియా!
రావోయీ నా సఖుడా ! మదినేలే మోహనుడా !
నే నీకై వేచి ఉన్న బృందావనం లో రాధ లా.....


అరవిందదళం నీ నేత్రమా
అరవిచ్చిన కుసుమం నీ లాస్యమా
మకరంద మధురం నీ స్వరమా
బాణుని కిరణం నీ కంటి శరం
అన్ని సొగసులు కలిసిన నీ అందం
ఆత్మసౌందర్యం తో పరిపూర్ణం
చెలీ నా హృదయ నందనం నీకోసం
నను చేరుమా నా వసంత సమీరమా!


మాటలకందని భావం
మది పాడే మౌన రాగం
మౌనాని మించించిన భాష్యం
నీ చూపుకై పరవశించే హృదయం
ఎలా చెప్పను నా అనురాగం
హా..! తెలుపుమా నీ అంగీకారం ......


కలల కొలనులో వికసించిన కలువను
కోరనిది ఎవ్వరు?కాని కష్టపడేది ఎందరు?
ఆశలు అందరికి ఉన్న,ఆశయాలుగా మారేది కొందరికే
కలలని ప్రేమించు,ఆశయాలకోసం జీవించు
విజయకాంత నీ వెన్నంటి ఉండేలా అహర్నిశలు శ్రమించు!


మౌనమే నీ బాషనా ఓ చెలియా
నా ప్రేమ నీ ఆరాధనకోరునుకని,చెలి నిను కాదు
నీ క్షణకాల వీక్షణం,నా మది లో ఆనందలోక విహారం

ప్రేమ అదో స్వార్ధ రహిత తపస్సు,కాంక్షరహిత యశస్సు
నీ మౌనం నాకు సమాధానం
నీ సంతోసము నాకు ఎనలేని విజయం
నీ చిరునవ్వు కోసం నా మది మౌనం ఆవశ్యకం
అది నాకు సర్వత్ర ఆమోదము

చెలీ,నేను బగ్న ప్రేమికుడిని కాను
నిరంతర సంతోషిని
నీ రూపం నా కన్నుల వెలుగు
నీ మాట నాకు స్ఫూర్తి
నీ పై నాకు కోపంలేదు
నీవు నాకు మోదమే కాని ఖేదం కాదు

నిరంతర ఆనందలోకపు పరిచయం చేసిన నీకు
నేను ఎల్లపుడు నీ శ్రేయోభిలషిని కాని మరోటి కాదు
నీ ఆశయాలు నిన్ను చేరాలని
నీ బాగున్నవనే కబురు నాకు తెలియాలని ఆశిస్తూ....


శ్రీరామనవమి ఉత్సవం
ఐదు రోజుల పండగ వాతావరణం
ఆలయమంత చిన్న కిష్కందకాండం
ఎటుచూసినా వివాహ వేడుక కోలాహలం
సీతమ్మ మా ఇంటి ఇంతి అయినట్లు
రాములవారికి అప్పగింతలు చేసే వైనం

కోజాగిరి పున్నమి వేళా,అందరి ఆటపాటల ఆనంద హేల
నిషి రాత్రిలో ఆపున్నమి వెలుతురు లో
క్షీరం లో శశి దర్శనం,ఆపై ఆ అమృత క్షీరపానం
ఎప్పటికి మరువలేను ఆ క్షణం

కార్తీకమాస వేళా గోదావరిస్నాన ఆరాటం
వనబోజనాలకై మేము పడే కుస్తీలు
ఉసిరికాయల వేటలో పిల్లరాక్షసులు
కార్తీక పున్నమికి కి సాటిగా
మా ఊరి ఆడపడుచుల ఆలయ దీపాలంకరణ

మా ఆలయ రాముడు
నా ఉనికి కారకుడు
ఏకాంతం లో స్నేహితుడు
నన్ను కనిపెట్టుకోనిఉండే ఉండే రక్షకుడు

ఎన్ని చెప్పిన ఏదో మరిచాన్నన అనుభూతి
నా ఊరు మరవలేని జ్ఞాపకాల సంద్రం
అలల లాగా అవి మదిని తాకుతూనే ఉంటాయి
తీరం చేరాలనే ఆశే లేని మతైన ఆనందాన నేను తేలుతుంటాను


పుడమితల్లి పచ్చని చీరకట్టి
కోతకొచ్చిన పైరు కన్నెపిల్లలా నాట్యంచేస్తుంటే
పసిడిపొలాలు శ్రావనలక్ష్మిని ఆహ్వానిస్తునట్లు ఉంటుంది

పల్లెపదాలు పాడుతూ నాట్లు వేస్తున్న పడతులు
మంత్రముగ్దున్ని చేసి పిలచినట్లుంటుంది

ఆగట్ల వెంట వడి వడిగా బడికి నడిచి వెళ్తే
తుల్లకుండా నడిచిన తరుణం
ఎవరస్ట్టు ఎక్కినట్లుంటుంది

నా సఖి నాకోసం బొండుమల్లెలు చాటుగా తెస్తే
నాకు నాకే అవి సొంతమని గర్వంగా చెప్పాలనిఉంటుంది

అంటరానితనం మిక్కిలిగా ఉన్న ఆరోజులలో
నేను నాస్నేహం చేతినీరు తాగానని తెలపాలనిఉంటుంది

మాఊరి బతకమ్మ పాట ,ఈ రోజుకూడా నా మది వల్లెవేస్తుంటే
ఒక్క మారు విహంగమై ఆ ఊరు చూసిరావాలనిఉంటుంది

దసరాకు మేము చేసే శమి పూజ
ఆపై శమీపత్రం కై దాని పై దండయాత్ర

ఓహ్! ఏమి చెప్పాను నా బాల్యం గూర్చి
ఏమని వర్ణించను మా పల్లె అందం గూర్చి

ఉన్న ఊరు ,కన్నతల్లి
ఏది సాటి రాదు ఈ పెన్నిదికి


కొంగొత్త భావాల కవిని చేస్తుంది ప్రేమ
కొత్తకాంతులని చూపే రవిని చేస్తుంది ప్రేమ
శిల తానై ఉలి తానై నిన్నుశిల్పిలా మలుస్తుంది ప్రేమ
ఎందరు చెప్పిన ఇంకా ఏదో కొత్తదనంతో ఉంటుంది ఈ ప్రేమ

ఆ అనురాగపు అలలు యద తలపుల మీటగా
కవిహృదయం నిత్య యవ్వనం
ప్రేమకు బాష్యం ఏమైనా అది అజరామరం


కనకరాసులున్న కన్నీరు తుడవగలవా
క్షణం తీరికలేదంటున్నా మది నిను తలుచుట మరవగలదా
చిన్నారి నీ చేతుల స్పర్స నన్ను నది రాతిరి లో తడుముతుంటే
నిన్ను తలుచుకొని ఏడవలేక నీకై నేను విహంగం కాలేక
తల్లిపడే తపనేమిటో తెలుసోకమనే మా అమ్మ మాట జ్ఞప్తికి వస్తుంటే
నేను ఇంకా నవ్వుతుననే అన్న విస్మయం కలుగుతుంద్తే
అది నీ ఆలోచన లోని మాధుర్యం అని నేననకుండా ఉండగలనా

నా బంగారు తల్లి !
నీ బుజ్జి బుజ్జి మాటలు, గుడి మెట్లపై మనం వేసుకున్న పందాలు
ఇసుక లో ఆడుకున్న గుజ్జనగూలు,నింగి లో తారలతో వేసిన బొమ్మలు
సిరి! నేను నిన్ను వదలి రాలేదు,నా బాల్యం వదిలాను రా తల్లి
నీ బతకమ్మ పాటలు,పూల కై పడే పాట్లు
అమ్మమ్మతో చాడీలు,లడ్డు కై నువ్వు పడే కుస్తీలు
ఎక్కడునై రా ఇక్కడ ?
యాంత్రికం జీవితం,నీ జ్ఞాపకం దానికి ఇందనము రా
నిన్ను చూడాలి మళ్ళి నా బాల్యం నాకు కావాలి

..........మీ అమ్మ


కలికంకైనా కోపం చూపని
నా కాంత కలువ కన్నులేవి
నా ఏకాంతంలోనైనా నేన్నున్నానని
కవ్వించే నా యద సవ్వడి ఏది
ఎంత దూరమున్న ఏ తీరమైన
నింగిలోని జాబిలి తో కబురుపంపే
ఆ కోమలి జాడ ఏది
సంద్రపు ముత్యమును తన మునిపంటిగా చేసి
క్రీగంట నను చూసే నా నెఛెలియ ఏది
ఇంత అలజడికి ఆనవాలైన ఓ అనురాగమా
పున్నమి వెలుగుల ఈ పసిడిమనసు నా సొంతం
నా జీవన కుసుమానికి గుబాలింపునిచ్చిన నేస్తమా

వేయిజన్మల వరమా!
నా ముంగిట విరిసిన వాడని కుసుమమా
నీసహచర్యం మరుజన్మికైన తీరని ఋణం
ఋనానుబందేనా మాతా పిత పత్ని పుత్ర సఖా
తీరని ఆ ఋణం నన్ను మళ్ళి మళ్ళి చేరుచును
నీ అనురాగహృదయ నందన వనం


కమ్మని కలలు ఇచ్చే నీ తలపు
వేయి వసంతాలను మరిపించే నీ వలపు
కోటి కావ్యలైన ఒదగని ఆభావం
నా సహజివనమా అపూర్వం నీ అనురాగం

కవ్వింతలు ఉన్నాయ్,కన్నీలు ఉన్నాయీ
నీ ప్రతి విమర్శ లో దాగే ప్రశంశ
కోటి విజయాలకు తొలి పలుకు
నిదురరాని కలత రాత్రి లో
నేస్తం నేనున్ననన్నావు
సగటు మనిషి కష్టం
నాకు కొత్తేమి కాదన్నావు
కథ వా కల్పనవా

ఎవరు నీవు ఎవరు నీవు
అద్దంలో ప్రతిబింబం నీవా
నిశీధి లో చిరుదివ్వె నీవా
నా భ్రుకుటిన వెలిగే అరుణం నీవా

అన్ని ప్రశ్నలకు సమాదానం నీవై
నా జీవన గమ్యం నీవై
నను వరించిన నా నేస్తమా
నీ కోపం నాకు శిక్ష అని తెలీకున్నదే
ప్రాణమా నీమాట నాకు ధైర్యం
మౌనం వీడి నను చేరవోయీ ....


నిశిరాతిరి లోకం నిదురించే వేళ
నేనెందుకు నీకోసం ఆలోచిస్తాను
నీ దరహాసం గుర్తొచ్చిన వేళ
నేనెందుకు ప్రశాంతత పొందుతాను
మధుర మంజుల స్వరం విన్నవేళ
నేనెందుకు నీకై వెతకుతాను
నేను నీవైన వేళ
మళ్ళి నీకోసం నేనెందుకు
పదే పదే కలవరిస్తాను
ఓహ్! అనురాగమా
పరిణయం ముందు
నీవెవరు నేనెవరు
ఇప్పుడు నువ్వే నేనై
నాకే నన్ను పరిచయం చేసిన
నా సహచర్యమా నీ కోసమే నా శ్వాస


యద లోతుల్లో ఉన్న వేదన
పదాలలో ఒదగదేమి
ఎంత చెపిన చకోరి ఎదురు చూపు ఆపదేమి
శిశరమ్ ఎవరని బాదించాలని
ఆకు రాల్చదు కదా
వసంతం ఎవరికోసం త్వరగా రాదు కదా
జీవితం నిత్య పాట్యకథనం
ఈసత్యం నేర్చుకుంటే మనం ధన్యం
నీ జ్ఞాపకం నేనునంతవరకు
అది అజరామరం


సుమధుర కావ్యం స్నేహం
ప్రేమ కన్నా మిన్న ఈ అనురాగం
మధుర మంజుల భాష్యాలకు ఆలవాలం
జీవితానికి నిత్య అమృత రసపానం
కాంక్షరహిత తపనకు తార్కాణం
సృష్టిలో దాగిన వెలలేని ధనం
నేస్తమా నీటికి నేను అంతే సత్యం
అంటోంది ప్రతిఒక్కరితో ఈ స్నేహం


ప్రతి విజయం నీ జ్ఞాపకం తెస్తుంటే
మది నన్ను నిలదీస్తుంది
అసలు నేనెపుడు నిన్ను మరిచానని
చిన్ననాటి మాటలు నేటి నా ఐశ్వర్యాలు
నేస్తమా -ఆ బాల్యం,నీ స్నేహం ఎప్పటికి మధురం
నేను ఆ సీమను వీడి
మన భారతావని దాటి
ఇంత దూరాన ఉన్నా
మన మాటలు ఇప్పతికీ స్పూర్తినిస్తాయీ
నీవు బాగునావ్ కదూ
భవిష్యత్తు తీర్చిదిదుకున్నావ్ కదూ
నీ ఆశయంసాధించవనే సువార్త వినాలని ఆశిస్తూ


About Us