दिल की चोकट पे
उसकी तस्वीर पाके
हैरान होगये है हम |

इस गुमराह ज़िन्दगी में
उनके जादूगरी अंको से
प्यार का प्याला पीनेके लिए
आज भी बेकरार है हम |

देखते देखते  साल गुजर गए
दुनियादारी की चक्कर में हम उलजते गये |

दिल को एक लम्हा पुरसत मिली तो
यादो की किताब पड पड के
कुश होजाते है हम |
फिर से उनकी प्यार में
डूब जाते है हम |

यारा | तेरे प्यार को सलाम |
जवा जवा उन यादों को सलाम |


నను మరచి, మన్నించమని నను వీడిన తనకి
ప్రతి క్షణం నా జ్ఞాపకం పదే పదే వెంటాడునేమో !
మౌనం గా తనని మన్నించానని తనకి తెలిసి
క్షణ క్షణ మదన పడుతుందేమో తాను !
తనని నేను నిజం గా మరిచానని
మరుక్షణం స్థిమిత పడుతుందేమో!

ఏది ఏమైనా  కాని  ,
నీ సహవాసం బౌతికంగా శాశ్వతం కాకపోని ,
కంటికి నీవు దూరమైనా.....
హృదయ స్పందనంత చేరువ నీవు

కాని సఖి...నీ సమక్షాన చెప్పకున్నా
నామది  నీతో నివేదించుకున్న మాటలివి
క్షమాపణ చెప్పేంత తప్పు నీవు చేయలేదు
నీ అమాయకత్వం ,ఆ బుగ్గల తొలి సిగ్గుల పువ్వులని
వసివాడేలా చేసిన నీ దోషిని నేను!

కడ వరకు నేను నీతో కలసి నడుస్తాననే
నా మాట ని నిజం చేస్తాననే నమ్మకం
నీకు నేను కలిగించలేక...,నీ నా తొలి ప్రేమని 
అడవి  గాచిన వెన్నెల  చేసినందుకు మన్నించు  స్నేహం!
మరు జన్మలోనైనా నీవాడిగా మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తూ
నా నీ ఆశయాలకై శ్వాసిస్తూ....
నీ నేను


నిను చూసిన తరవాత
నా మది లో ఉప్పొంగిన భావ కెరటమే ప్రేమ!
నిను చూడగానే  నవ్వే
నా కళ్ళలోని కాంతియే ప్రేమ!
నిశ్శబ్దం  గా నీతో మాట్లాడే
నా మూగ మనసు కోరేది ప్రేమ!
పువ్వుల పై తిరిగేడు
తుమ్మెదల ఝుంకారమే  ప్రేమ!
ప్రేమంటే ఏమి చెప్పను?
నా ప్రేమ ను ఎలా నిరూపించను ?
నీవు నిందించినా నవ్వుకునే
నా పిచ్చితనమే ప్రేమ!
నాకు తెలిసింది ఒక్కటే
అది నువ్వంటే నాకు ఎనలేని ప్రేమ !


About Us