నను మరచి, మన్నించమని నను వీడిన తనకి
ప్రతి క్షణం నా జ్ఞాపకం పదే పదే వెంటాడునేమో !
మౌనం గా తనని మన్నించానని తనకి తెలిసి
క్షణ క్షణ మదన పడుతుందేమో తాను !
తనని నేను నిజం గా మరిచానని
మరుక్షణం స్థిమిత పడుతుందేమో!
ఏది ఏమైనా కాని ,
నీ సహవాసం బౌతికంగా శాశ్వతం కాకపోని ,
కంటికి నీవు దూరమైనా.....
హృదయ స్పందనంత చేరువ నీవు
కాని సఖి...నీ సమక్షాన చెప్పకున్నా
నామది నీతో నివేదించుకున్న మాటలివి
క్షమాపణ చెప్పేంత తప్పు నీవు చేయలేదు
నీ అమాయకత్వం ,ఆ బుగ్గల తొలి సిగ్గుల పువ్వులని
వసివాడేలా చేసిన నీ దోషిని నేను!
కడ వరకు నేను నీతో కలసి నడుస్తాననే
నా మాట ని నిజం చేస్తాననే నమ్మకం
నీకు నేను కలిగించలేక...,నీ నా తొలి ప్రేమని
అడవి గాచిన వెన్నెల చేసినందుకు మన్నించు స్నేహం!
మరు జన్మలోనైనా నీవాడిగా మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తూ
నా నీ ఆశయాలకై శ్వాసిస్తూ....
నీ నేను

0 comments: