ఏదో పేజిల కొద్ది రాయాలని ఉంది
గుండెలోని బాధనంతా అక్షరాలలో పేర్చాలని ఉంది
ఆత్మ ఘోష హస్యాస్పదంగా మారిన వేళ
నన్ను నేను సముదాయించుకోలేని వేళ
కసిగా నాలుగు ముక్కల్లో నా విధిని కడిగేయాలని ఉంది
ప్చ్........ ఎంత వగచినా ఏమి లాభం
గతం తిరిగి రాదు,
గుండెలోని బాధనంతా అక్షరాలలో పేర్చాలని ఉంది
ఆత్మ ఘోష హస్యాస్పదంగా మారిన వేళ
నన్ను నేను సముదాయించుకోలేని వేళ
కసిగా నాలుగు ముక్కల్లో నా విధిని కడిగేయాలని ఉంది
ప్చ్........ ఎంత వగచినా ఏమి లాభం
గతం తిరిగి రాదు,
నాది కానిది ఎన్నటికీ నాది కాదు
నేను అనుకున్నది లేదని వగచే కన్నా
ఉన్నదే నాదని ఆనందిస్తే హాయి ఏమో?
రేపు కనీసం ఇంతకన్నా మెరుగ్గా ఉంటుందేమో ?నేను అనుకున్నది లేదని వగచే కన్నా
ఉన్నదే నాదని ఆనందిస్తే హాయి ఏమో?
ఈ ఏమో ఏమో ల ఆశ లో మూడు పదులు గడిచాయి
నేను ఇలా ఆలోచించనేమో?
ఏమో ఏమైనా ఇది నా జీవితం కాదేమో అనే భ్రమ
ఇది నేను పడాల్సిన కష్టం కాదేమో ?
ఏమో ఏమైనా ఇది నా జీవితం కాదేమో అనే భ్రమ
ఇది నేను పడాల్సిన కష్టం కాదేమో ?
నాకోసం ఆ విదాత ఇలా రాయలేదేమో
ఇలా ఏవేవో ఆలోచనలు,
ఇలా ఏవేవో ఆలోచనలు,
అసంతృప్తి కి సాక్ష్యాల్లా ఎన్నో ఆనవాళ్ళు
నిశ్చలమైన నీటి లో ఏవేవో గులకరాళ్ళు.........................
నిశ్చలమైన నీటి లో ఏవేవో గులకరాళ్ళు.........................
--
2 comments:
Raghu Mandaati said...
nice akka
Pranav Ainavolu said...
చాలా బాగుంది