శరీరం తో ప్రాణం విడివడట్టు
పువ్వు తో పరిమళం తోడులేనట్టు
ఏదో లోటు,ఏదో వెలితి...
నవ్వొస్తోంది నేస్తం!
నువ్వు నన్ను వదిలి వెళ్ళినా
నేను ఇలా ఎలా ఉంటున్నట్టు??
జీవితమంటే గడిచినవో రోజునో .. రాబోవు రోజునో
తలుస్తూ కలవరిస్తూ గడిపేయడమేనా...??
ఏదేదో సాదిస్తూ నన్ను నేను కోల్పోవడేమేనా...??
ఆకాశాహర్మ్యాలను నిర్మించాను
భూగర్భజలాలను వెలికి తీసాను
సృష్టి కి ప్రతి సృష్టి చేసాను
ఏదేదో చేసాను నేనంటే నేనే అనిపించుకున్నాను
కాని నీఆలింగనంలో తెలుస్తుంది నా లా నేను లేనని
జీవితపు పందెం లో నన్ను నేను ఓడానని
క్షణం క్షణం కోల్పోతూ రేపటికోసం పరితపిస్తూ
ఉన్నది ఆస్వాదించక,పోటి తత్వాలతో..
జీవించటం మరిచి ...బ్రతకటం నేర్చాను!
నాతో నేను మమేకమై చాన్నాలైంది
అక్షరాలలో నన్ను నేను పేర్చుకొని,
వర్ణమాలతో భావాలకు రంగులద్ది,
చాలారోజులైంది... నేను నేనులా ఉండి!
నన్ను నేను పునర్నిర్మించుకుంటా ....
ఈ నవనాగరికత నీకు నాకు నడుమ
అడ్డుగోడ కాకుండా సరిచూసుకుంటా ...
-ఎప్పటికి నీ నేను
0 comments: