నిన్న రాత్రి.................
పండు వెన్నెలల పిండారబోసినట్లుంది
ఆ రేయి లో నేను....నా ఏకాంతం
నా లో మెదిలే తన జ్ఞాపకం

ఎవరో   పిలిచినట్టు
ఉలిక్కిపడి పైకి చూసా
ఆ నింగిన జాబిలీ
నా తో మాటలాడుతోంది  
నన్నిలా ప్రేమగా అడగసాగింది

ఎవరు తాను ? ఏమిటా కథ అని?
చెప్పేంత విషయమేమీ లేదని నేనన్నా!

ఎలా ఉంది నీ జీవితం అని?
ఏ ఆరాటం లేని ప్రశాంతత అని నేనన్నా!

ఏమైనా ఈప్సితం  తీర్చనా సఖి అని  ?
ఇచ్చాలోకం కు ఆవల నేనున్నా అని నేనన్నా!

ఎవరినైనా ప్రేమించావా ప్రియా అని?
ఇసుమంతైనా అలాంటి ఊసే లేదని నేనన్నా!

ఏమైనా వంచన తో వగచావా అని?
మచ్చుకైన అలాంటి జ్ఞాపకమే లేదని నేనన్నా!

అప్పుడు తానంది మరి నీకోవిషయం చెప్పనా అని?
చెప్పవమ్మా చల్లనమ్మా అని నేనన్నా!

తను...........చెప్పిందిలా
ఎవరినైతే తలచి వలచావో
తన తోడు నీకు  ఈ గడియన  లేదు కదా...! అని....
నేను..........................................................


ఎన్ని రోజులు ఈ మౌనం
ఇంకెన్ని రోజులు ఈ క్షణ క్షణ మరణం

స్వప్నం సత్యం కాలేదని
తలచి తలచి వగచేవు
సాలోచన దిశ గా
అడుగువేయుట మరిచేవు !

నీవు కోరావని జరగవు అన్నీ
కాదన్నావని ఆగవు కొన్ని
ఆటుపోటుల మిశ్రమం ఈ జీవితం!

ఓటమి లో కూడా చూడు విజయం
ఈ క్షణమిన్తే అని తృప్తి నొంది
గడుపుటయే కదా ఆ క్షణ ఆనందరహస్యం!

కన్నీటి కాలువనందైన
కత్తి  పడవ నడుపుట నేర్చుకో
ముళ్ళబాటలో ముందడుగు వేస్తే
శహబాష్ అని మనసారా నిను నీవు  మెచ్చుకో!

మనసే బలం,మనసే బలహీనత
నీ మనోరాజ్యని మొదట జయించు
సవాలు వేసే సహజలక్షణం తనదైతే
దాని సరదా తీర్చే సత్తా నీది !

కాలాన్ని  బట్టి నడిచేది కొందరు
కాలం తో పోరాడేది కొందరు
కాలాంతం వరకు చరిత లో నిలిచేది ఎందరు!

సువాసన లేని గంధపు చెక్క
రాతిరిన మెరియని నింగిన చుక్క
ఎన్నడు వసి వాడని కుసుమపు రెక్క
కన్నీటికి తడవని చెక్కిలి
సాధ్యమవునా నేస్తమా!

మరెందుకు ఈ తపన
నిశ్శబ్ద నరక యాతన !


శిశిరం లో కొత్త చిగురు వింత కాని
ఆకురాల్చే ఆ సోయగానికి చింత ఏల?

వలచి వచ్చానంటే విభ్రమంకాని 
అపరిచితలా  నిను దాటి వెళ్తే ఈ చిత్తభ్రమ  ఏల ?

ఆ స్వరసంజాత తన పలుకు కులుకు ఆలకించ మందే కాని
ఆ మంజునాధం నీ యధసవ్వడిలా ధ్వనిస్తే ఆ కోమలి దోషమేలా?

కలలు కన్న నీ కనులు
వెర్రెక్కించిన  మది ఊసులు
నిలువలేక ఒర్రుతలూగిన వయస్సు
స్థిమిత బుద్ది మాట చెవినపెట్టకపోతే
హృదయం లేని ప్రియురాలా అని తన పై నిందలేల?

వినకు వెర్రి మనసు మాటలు
రేపును విరహపు వెండిమంటలు
శలభం  లా మాడిపోయేదవు  నేస్తం
శిశిరంలో ఆకులా రాలిపోయేదవు   సమస్తం!

శిశిరం తరవాత వసంతం అనివార్యం
కొత్త చిగురు వచ్చును తధ్యం
కాని రాలిన ఆకు చరిత శూన్యం
అనాలోచిత మోహపు మైకం లో
చేసుకోకు నిర్లిప్తం ఈ క్షణం


ఒంటరిగా ఉన్నవేళ
వేల వేల ప్రశ్నలు
సమాదానం నిశ్శబ్దం
అని తెలిసిన విసిగించే పరిస్థితులు

అల్లారుముద్దుగా పెరిగిన ఆఇంటిని
ఆనందమే నా చిరునామా చేసిన ఆ ఆవరణని 
మూరెడు పసుపుతాడు తో
అరనిమిషంలో చుట్టాన్ని  చేసారు
పండగలకి పబ్బాలకి అతిదిని చేసారు

తప్పటడుగులు  నేర్పిన నాన్న
రెండుపదుల ప్రాయం వరకు
రాకుమారి లా చూసిన నా వాళ్ళు
ఏడడుగుల  తో ఒక్కసారిగా
నన్ను వెళ్ళి రమ్మని పరాయిని చేసారు!

జన్మకు తోడు కలిపామంటూ
జన్మనిచ్చిన వారు ఒక్క ఘడియ లో
అపరిచితవ్యక్తి  చేతిలో నను పెట్టి
జన్మాంతం వారికి నను  దూరం చేసారు !

మీ అమ్మ మీ నాన్న అంటారు తను
కాని మా అత్త మా మామ అనాలి నేను!

కన్నవాళ్ళను చూడ  కావాలి అనుమతులు
మారాలి ఒక్కసారిగా కట్టుబొట్టు మర్యాదలు!

అప్పటివరకు చదువుల  తల్లి   నేను
ఆ క్షణమే అవ్వాలి అపర అన్నపూర్ణ
ఆకతాయి అల్లరి మరచి ,
కొత్త ఇల్లాలి తుళ్ళింత మరచి
అవ్వాలి నేను అరవయి ఏళ్ళ ఆరింద!

ఉన్నమాట అని పదుగురి నోట పడే కన్నా    
చిన్న నవ్వురువ్వి నిన్ను
కాదనుకోమంటుంది  అమ్మ!

మళ్ళి కొత్త జన్మేతినట్లు
అంతా కొత్త అలవాట్లు
కొంగొత్త  అనుభవ పాఠాలు  !

ఇక అదే నీ ఇల్లు
అంటుంది  అమ్మ
కోపమొస్తే మీ ఇంటికి పో
అంటాడు ఆయన!

మరి ఏది నా ఇల్లు ?
ఎవరికీ నే  ముఖ్యం?   

ఈ మీమాంస తేలేలోపు ఇంకోఘట్టం
మాతృ మూర్తి గా పదవీస్వీకారం
అంతులేని సాగరం ఈ జీవనం
భావోద్వేగ అలల పరంపర అనివార్యం ! 


మాటరాని మనసుకు
ఎన్నో ఊసులు
క్షణభంగుర  జీవితానికి
ఎన్నెన్నో సవాళ్ళు

అయినా
కడగల్లు లేని జీవితం
భిందువు లేని సింధువే కదా!
మరెందుకు ఈ వేదన
లోలోపలే  ఉండే ఆవేదన !

మౌనాని సైతం పలికిస్తా
కాని నా స్థితి చెప్పలేక  
మౌనమే నా పలుకైనదే
సరదాకైన నిను మరువలేను  
అని సరాగాలు పాడే హృది కి
నిన్ను మరిచి పోమని ఎలా చెప్పను ?

తాను నా గుండెనడిగినా  
చిరునవ్వుతో ఇస్తానన్నా!
కాని గుండెలేని నీ గూడు
తాను అడుగుతుందనుకొని
అణుమాత్రమైనా అనుకోలేదే !

ఏమి తెలుసు తనకి
నేనిచ్చే రోజా పువ్వు
నా పెదాలపై నవ్వు తప్ప!

నన్ను గా స్వీకరించే
సుమదుర స్నేహం నీవు
నేనింకా  పసివాడినే అనే
బాల్య స్నేహ పరిమళం నీవు
ఏ మాలిన్యం లేని స్నేహ మాలిక నీవు!

వింతగా ఉంది నాకంతా
నా మనసు గెలుచుకున్న
తనకు తెలీదా ఇదంతా?

కాని నా నేస్తమా!
నీపై నిందలు వేసే తనకు
నీ స్నేహమాదుర్యం ఏమి తెలుసు ?
నిను వదులుకోమని నాతో పలికిన ఘడియ  
నాలో రేగిన ఆ పెనుతుఫాను
ఆ ప్రియురాలి హ్రుదయానికేమి తెలుసు ?

ప్రేమ గొప్పదే కాని
అంతా నాదే అన్న స్వార్ధమేమో!
ఆ జవరాలు ఇల్లాలైతే
నా స్నేహభావం తనకు తెలియునేమో ?!

అనురాగమా!
సువిశాల  జగత్తు లో
ఇరుకైన మనుస్సులో
యాంత్రిక జీవన నడవడిక లో
నాకో స్థానం ఇచ్చినందుకు
నీకు కృతజ్ఞత ఎలా తెలపను?
ఆ స్థానం లో నేను ఎప్పటికీ ఉంటానని తెలిసినా
నిను మళ్ళి కలవలేనేమో అనే బెంగ ఎలా వివరించను?




 
 




కన్నా!
నాఒడిలో ఆడుకున్న చిన్నికృష్ణుడివేనా నీవు
వెన్న ముద్దలు తినిపిస్తూ ,పించము పెట్టి
కస్తూరి తిలకము దిద్ది ,మువ్వలు కట్టి
ముస్తాబు చేసిన ముచ్చట ఇంకా తీరనే లేదు!

యదుకులం లో చేసిన అల్లరి
గోపికలు చేసిన ఫిర్యాదులు
ఉట్టి కొట్టి వెన్న దొంగిలించిన వైనాలు
మట్టి తిని విశ్వాన్ని చూపిన చిత్రాలు
ఇంకా ఇప్పుడే జరిగినటుల ఉన్నది కృష్ణా!

ఈ అల్లరి కి నేను నీ పై అలిగితే
అమ్మా అని గారాబం చేస్తూ...
నీ బుజ్జి చేతులతో నా బుగ్గతడిమిన
స్పర్శ ఇంకా నులి వెచ్చగానే ఉంది యదునందనా !

మధుర లో నీవున్న నీ మధుర జ్ఞాపకాలతో
నేను నిత్యం నీతో నే ఉన్న కదా కన్నా!
ఇంత నిడివి లోనే అంత వాడివయ్యావు
యశోదనందనుడు అయిన నా చిన్ని కృష్ణా ,
మదురాధిపతివై,రుక్మిణి కృష్ణుడవయ్యావు!
    
నిన్ను దండించిన ఈ చేతులను
రోటి కి కట్టిన ఈ కఠోర కరములను
నోటి తో ఒక్క మాటైన పలకక
ఇలా నన్ను దండిస్తావా?
ఇది నీకు న్యాయమా  మానస చోరా ?

పదహారు వేల కన్నియలను పెండ్లాడిన
నా ముద్దు కృష్ణుడి   కళ్యాణ కాంతి ని
కన్నులార దర్శించే బాగ్యం లేదే !
కాటిన్యం గా దండించేనని ఈ కరములకు
ఈ కళ్యాణ కిశోరుని ప్రియమార తడిమి
హత్తుకునే అదృష్టం  లేదే !

అనంత కోటి బ్రహ్మాండ నాయక!
ఈ స్త్రీ జన్మ నీ పుత్రవ్యామోహ మహిమ
నాకు నీవు పుత్రుడివే కాని
ఈ విశ్వ నాయకుడిలా చూడలేను!
నను మన్నించి ఈ అమ్మ కు
నీ కళ్యాణ భాగ్యం కలిగించు
మనోహర   మోహనాకారా !






ఆనందపు   సిరులు వికసించే విరుల తోట తాను
రాలిన  పూల సోయగానికే మురిసే  తోట మాలి నేను !
మృదురోహాల భావాల మందస్మిత వదన తాను
ఆ మధుర పవనాల తాకిడికే అల్లాడే చిగురుటాకు నేను!
కావ్యకళను మేల్కొల్పిన కమనీయ కావ్యనాయక  తాను
పడపుష్పలతో అర్చన చేసి కవిగారి ఇంటి కాకి ని నేను!
విధాత తీరికగా చేసిన ముద్దుగుమ్మ తాను
తోచక చేసిన ఓ మట్టి ముద్ద నేను !






కవితకు అందని కల్పనా నీవు
కావ్యం గా రాయలేని భావన నీవు

ఆ  సుస్వరమ విన్నవేళ
నే సర్వస్వం  మరచిపోతాను!
ఆ స్వర ఏలిక స్వరూపం చూడాలని
అడగలేక సతమతమౌతాను!

ఓ మంజుల గానమా !

కలలో మురిపించే నీవు
నాకు కన్నీరు మిగిల్చవు కదా!
కనిపించకనే కలవరం రేపిన నీవు
కలత నిదురల రేయి ని చూపవు కదా!

నను చూసి కరిగిపోమని నేనను
కాని క్షణమైనా నన్నర్థం చేసుకుంటావని ఆశిస్తా!
ఆ ఒక్క క్షణం నాకు ఇవ్వు,అది చాలు సఖి
నేను నీకు నా జీవితమే అర్పిస్తా !








నీ పిలుపు లో ఆప్యాయత
చవి చూసిన మనసుకు
కనులు నిను చూడలేదన్న
ధ్యాస కూడా లేదు!

ఎక్కడివారమో
ఇక్కడ ఒక చోట చేరి
ఎనలేని అనుబందం
పెనవేసుకున్నామనుకున్నా!
అరనిమిషమైన ఆలోచన చేయక
అనుకున్నదేదైన నీ తో చెప్పేసే మనసుకు
అపార్థం చేసుకొని చులకనచేస్తావేమోనన్న
అనుమానం కూడా రాలేదు!
నేను ఇంతే
నా నైజం ఇదే
అదికాదురా అని నీవు
మాటాడే మాటలో
ఒక బాల్య స్నేహం రుచి చూసా!

కలకాలం కలిసి
ఉంటేనే స్నేహం కాదు!
కవితలా చెప్పడానికి
అదో కావ్యం కాదు !
నా  హృదయ భావన
అమ్మ ప్రేమంత స్వచ్చన!
అది ఎప్పటికి నాకు అమూల్యం 


ఏదో వెలితి ఉంది నేస్తం
శూన్యం లోకి చూస్తాను
నాలో నేను రోదిస్తాను
కల్లబొల్లి మాటలతో 
వేదాంతి లా ఒదార్చుకుంటాను

కంటిలో చెమ్మ లేదు
నాది శోకమ అని చెప్పడానికి

బొంది లో శ్వాస  ఆగలేదు
నాది మరణం అని చెప్పడానికి!
నీకై నిద్రాహారాలు మానలేదు
నాది వెర్రి మోహం అని చెప్పడానికి!
నా చేతి లో చెయ్యేసి నువ్వు చెప్పలేదు
బాస మరిచావని నిను నిందించడానికి!
నేను కనులతోనైన సమాదనమివ్వలేదు
బాద్యతల చూసి నీవు భయపడ్డావనడానికి!     
కలిగిన చిన్నఅపోహ తీర్చ నువ్వుచొరవ చేయలేదు
తప్పంతా నాదేనని నన్ను నిలదీసుకోవడానికి!

రోజులు నెలలై,నెలలు సంవత్సరాలైనాయి  
నా జీవన యానం ఏమి స్థంబించలేదు
కాని ......
నీ సహచర్యం లేని లోటు తో
సమూహం లో కూడా ఒంటరినవుతాను
జీవిత గమనం లో ....
దారులు వేరైనా పయనం లో
ఎక్కడున్నావో? ఏమిచేస్తున్నావో?
నా  జ్ఞాపకాలలో నీవు పదిలం
మరి నీవు.............?!






ఓ దైవమా
ధైర్యం చేసి ఓ దిగులును
నీతో విన్నవించుకుంటున్నా
సూటి గా నాలో రగిలే
ప్రశ్నా జ్వాలను నీ ముందుoచుతున్నా

మట్టి కి ప్రాణం పోసి
మమత తో మనసు చేసి
నీ చేతి తో నా తల రాత రాసావే
మనసు కోరే ఆశ,విధి తో
ఎందుకు వివరించలేదు
నా మనసు తపన
నీవు రాసిన రాత
రెండు నీ కల్పితాలే కదా
మరి నన్నెందుకు పావుని చేసావు?

ఒంటరిగా నేనున్నా వేళ 
జంటను నే కోరానా
తుంటరి ఊసులతో
ఎప్పుడైనా నే తల్లడిల్లానా
కావాలని నాకు ఓ జతను ఎంచి
తనతో నాకు జీవితం పంచి
నేడు చిన్న మాట తో ఎడబాటు చేసి
అర్థం కాని వ్యర్థం లా నను మిగిలిచావు
ఇది నీకు భావ్యమా ?

కనకరాసులు నే కోరానా
కలిమిలేమిలలో నే వగచానా
నీవు ఇచ్చిన తోడు
నాకు నీడలా  ఉంటుందని
పసిపాప లా చూసుకుంటుందని
నిర్వాజ్యం గా నమ్మానే తప్ప
నిరంకుశం గా తూలనాడానా?

పుట్టిన నా జన్మకు
పరిపూర్ణత తేవాలని
ఎన్నో విధాలుగా   పరితపిస్తున్న
ఇది మాయ మోహిత జీవనం
ఎక్కడుంది నాకై పరితపించే హృదయం ?

ధైర్యం చేసి చొరవతో  అడుగుతున్నా
నీనిశ్శబ్దంలో సమాధానం వెదుకుతున్నా....   




 




ఈ రాతిరి ఎంతకీ గడవదేమి
పున్నమి వెన్నల కూడా
వేసవి మండుటెండలా మారేనేమి
క్షణమొక యుగమంటే   నేను నవ్వుకున్నా
కాలాన్ని త్వరగా సాగమని నేడు  వెడుతున్నా!

ఎన్ని ఉన్నా ఏదో వెలితి
ఎప్పుడు ఏదో ఒకటి కోరే మనసు
లేదా నాకు మానసిక పరిణితి
లేక ఇది తన ప్రేమ ప్రవాహపు ఉధృతి


బంగారు.. అని తాను పిలిచే పిలుపు
కోటి జన్మలకైనా సరిపడే వలపు
నేను చంటి పాపను కావాలని ఉంది
తన కంటి పాప లో దాగాలని ఉంది

ప్రాణమా!
నిదుర పోనీ ఈ కనులకు చెప్పు
తొలిజాము కలలోకి నీవొస్తావని
గడవని ఈ విరహపు రేయి కి చెప్పు
తొలి ఉషాకిరణంతో నీవొస్తావని

ప్రియా!   ప్రౌడనైనా నాకు ఈ ప్రేమేమిటి?
నీ ఊసులతో,నీ ఊహలతో
నను దహించు ఈ విరహమేమిటి?
నువ్వు ఇలానే ఉన్నావా!
నా పేరే పలవరిస్తున్నావా!



 



అనంతసాగరం  ఈ   ఆలోచన  లోకం
ఒక చోట మునకేస్తే మరో చోట తెలుతావు
మరీ లోతుగా వెళితే మునకే కాని
మరలి వచ్చు  తీరం దారి మరిచిపోతావు
కనుక తస్మాత్ జాగ్రత్త నేస్తం!
ఈ జీవనసాగరాన
భావోద్వేగ అలల అలజడి చూడు
సంద్రపు హోరు పరిశీలించు
విశ్వసాక్షిలా జీవితాన్ని అనుభవించు !




pyasaa dil leke batak raha hoon
manjil paane ko tharas raha hoon
appke ke ankhon me thaa jannath hamaari
phir kyun iss jahanum me phirraha hoon


కోదండరాముడు కౌసల్య రాముడు
సీతామనోభిరాముడికా ఈ దుఃఖం
విశ్వాంతర్యామికా ఈ విషాద వదనం

జనస్థానమైనా వానప్రస్తమైనా
సీత వెంటే రాముడు,రాముడి తోడనే సీత
ఎడబాటు ఈ అశాశ్వత కలేబరానిదే కాని
అనంత ప్రేమది కాదు,
ఆత్మల కలయికకు ఎడబాటు లేదు
కానలకు పంపి నీవెంత కలవరపడ్డావో
నాకు తెలియనిదా ప్రభూ!

అడవిలోనేనున్న,నీఅపారదయతో
లోకపావనినైనాను,మునిపూజితనైనాను
అంతఃపురానానీవున్నా ,
అంతరాత్మ ఎన్ని బోధలు చేసినా
సువర్ణ సీత నీ ఎదుట ఉన్నా
ఈ భూజాత ను మరువలేదని
నాకు తెలీదా స్వామీ !

మన జీవనయానంలో,
మరి ఆ అశ్వమేదయాగంలో
నా లోటుకు ,ఈక్షణిక ఎడబాటు కు
నీ హృదయం దుఖించిన వైనం
పదాలకు అందని ఆ బాదతప్త క్షణం
నీనాకు తెలియనిదా దాశరథి!

లోకం నిన్ను వెర్రి రాముడన్నా
లక్ష్మణ సోదరుడు నినునిలదీసినా
మనోనిబ్బరం చూపిన ఆఅయోధ్యరాముడి
మానససరోవరంలో ఎన్నిఅలలో
కలవరింతలేని రేయిలేదని
నేను ఎరుగనా నాస్వామీ!

వనరాజ్యం,జనరాజ్యం రెండు నీఏలాను
నీమనోబిరాజ్యభిశక్తు రాలినై
సీతమనోభిరామా అని ఖ్యాతి పొందాను
క్షణికము కు నే వగచిన మాట నిజమే
కాని నీఆంతర్యం తెలిసి నీసితప్రజ్ఞనయ్యాను
ఎచటి నుండి వచ్చితినో అచ్చోటికే మరలిపోయేదా!
నామనవి మన్నించు పురుషోత్తమా!


అశాంతి లో ప్రశాంతత వెదుకుతున్నాను
నా నెత్తుటి దారతో పెదవి గులాబీ పూయిస్తున్నాను

మృగతృష్ణ జీవితాన,ఏదో ఒక మజలి లో
ఒయాసిస్సు ఎదురవదా అని ఆశతో అడుగులేస్తున్నాను
హాలాహల నిర్లిప్త సమయాన ,ఏదో ఒక సుదినం
ఒక అమృత గడియ ఎదురవదా అని ఆశ తోఆనందముగా గడిపేస్తున్నాను

చిరుప్రాయం లో యవ్వనం బాగుండాలని అన్ని మరిచాను
యుక్త వయస్సు లో నా జీవనం బాగుండాలని బాద్యతనెరిగాను
ఈ మద్య వయ్యసు లో నా పిల్లల క్షేమం కోరి శ్రమిస్తున్నాను
వ్రుధాప్యం నను హత్తుకోక ముందే నేనేంటో తెలుసుకోవాలని తపిస్తున్నాను

మది నేడు సూటి గా ఒక ప్రశ్న అడుగుతున్నది
అసలు జీవితం అంటే ఎప్పుడని ?
జీవితానికి కి అర్థం ఏమిటని ?

ఉన్న దాన్ని వదిలి ఏదో కోరుకుంటావు
ఈ క్షణం వదిలి రేపటికి పరుగెడతావు
పరిపరి విధాల నీవు భ్రమించి
చిత్త చాంచల్యం తో చిరాకు కొనితేచ్చుకుంటావు
ఫలితం రాక మనసు చిన్నబుచ్చుకుంటావు


మౌనం వీడి అంతరంగం నా తో మాటాడితే
మాట రాక మాటాడ లేక నేను మౌనమయ్యాను !

అశాంతి లో ప్రశాంత త వెదుకుతున్నాను
నా నెత్తుటి దారతో పెదవి గులాబీ పూయిస్తున్నాను


స్ఫూర్తిదాయకం నా జీవనం అవ్వాలని తానంటే
బహుసుందరకావ్యం కావాలని నేనంటాను !

అన్నెం పున్నెం ఎరుగని ఆనందధుని బాల్యం అని తానంటే....
అమ్మ ప్రేమతో ఎన్ని మాయలయినా నే చేస్తానని నేనంటాను !

అడుగడుగునా క్రొత్త సవాలు తో
ముందడుగేయి అని తానంటే....
అందమైన ముఖారవిందందాన్ని
అందలమెక్కిస్తానని నేనంటా !

అరమరికలు లేని అనురాగాజీవితం
కోరుకోసుమీ అని తానంటే......
ఆనంద గడియలె నా ఆనవాళ్లు అనే
ఆరాటమే నా వైఖరి అని నేనంటా!

వయసు తెచ్చిన హుందాతనం తో
హాయిగా ఉండు అని తానంటే....
వయసైపోతుందే అని ఉసూరుమంటూ
కన్నె ఈడు చూసి లోట్టలేస్తానని నేనంటాను!

అనుభవ సాహిత్యంతో ఆదర్శం గా జీవించి
మరుపులేని మనిషి గా మిగిలిపో అని తానంటే..
కృష్ణ రామ అంటూ ఈ కట్టే కాలేదాకా
కాలయాపన చేస్తానని నేనంటా !

ఈ పరస్పర విరుద్ద సంబాషణ
ఇప్పటిది కాదులే ఈ సంఘర్షణ
మొదలైయింది పుట్టిన తక్షణం

తాను మస్తిష్కమై .......
నేను మనసై......
ఒకే మనిషి లో ఇమిడిన క్షణం నుండి.....


నను చూసి నవ్విన క్షణం జీవితం స్వర్గమనుకున్నా
నను కాదని తెలిసిన క్షణం జీవితం నరకమనుకున్నా
తప్పు నీది కాదులే చెలి,తపనపడే నా మనసుది లే
ఆ రెండు క్షణాలే నే జీవితమనుకున్నా...........


నీకంట నీరుంటే
నా చెక్కిలి ఎందుకు తడిసింది
నీ లో ఆలోచన తుఫాను కి
నా మది ఎందుకు బరువెక్కింది
దీని ని ప్రేమ కాక ఏమంటావు
మనం అందరిని ప్రేమిస్తాము
అది మానవ లక్షణం!
అంతే కాని వింత కాదు
ప్రతీ మోహం శాశ్వత ప్రేమ కాదు


కలలుకనే మనసు కు కన్నీళ్లు ఎందుకు
కనే ప్రతీ కల నిజం కావాలని లేదు గా!
నిజాని కి నేను కష్టపడ్డనా అని ఆలోచించడం గొప్ప

నీవు నడిచే దారి సమస్తం
పూల తో ముస్తాబవ్వాలని లేదు గా!
ముళ్ళు ఉన్నా తప్పుకొని నడవడమే గొప్ప

ప్రతినిమిషం విజయకాంక్ష తో
గడిచే నిమిషాన్ని కోల్పోవాలని లేదు గా !
ఏ నిమిషాని కి ఆ నిమిషమే గొప్ప


ఎంతో పని చేసానని అలసాననే నీ మనసుని
ఒక్క మారు అడుగు అలసంటే ఏంటని?
అసలు విశ్రాంతి కి తన నిర్వచనం ఏంటని?

ఒక పని నుండి మరో పని కి మార్పే విశ్రాంతి
నీ పనిని ప్రేమించు ,
గెలుపు ఓటమిల ప్రసక్తి పక్కనపెట్టు
చేసే పని లో ప్రశాంతత వెదుకు
మనసు నిర్మలం అవుతుంది!
జీవితం సంపూర్ణం అవుతుంది!


క్షణక్షణం పరీక్ష లా సాగుతోంది జీవనం
ఏ పద్మవ్యూహం వేచి ఉందొ ఈ క్షణం
సరే మరి ఓ సమయం! చూస్తానులే నీపంతం
నా ఆత్మ బలం ముందు నీ ఓటమి తద్యం
ఎన్ని మార్లు నను గేలి చేసినా నా గెలుపు ఖాయం


చిన్న మర్రి గింజే కదానని ,చులకనగా చిన్నచూపుచూసి
నేల కేసి కొట్టి,ఉక్కు పాదం తో తొక్కితే
ఎంత లోనికి క్రుంగిందో ,అంతే బలం గా లేస్తుంది
శాకోప శాఖలు గా విస్తరించి ఔరా అనిపిస్తుంది !

ఆకాశం నా లక్ష్యము ,శ్రమైక జీవనం నా నైజం
ఏ క్షణం ఆగదు నా పయనం,సహనం నా లక్షణం
శ్రమ నా మార్గం,వివేకం నా అస్త్రం
నా ఆత్మ బలం ముందు నీ ఓటమి తద్యం
ఎన్ని మార్లు నను గేలి చేసినా నా గెలుపు ఖాయం


కనులలోని ఆశాజ్యోతి కనుమరుగు
కానీయకు నా అమూల్య నేస్తం!
ఈ మోహపు తెరల అంధకారం
చాలా దూరం వరకు ఉంది జీవితాన
నేను ఒక బాట సారినే!
నువ్వు ఒక బాటసారివే!
ఏదో ఒక మజలి లో
మళ్ళి కలుస్తాము!
స్నేహపు కాంతి ని
మళ్ళి ప్రసరింపజేదాం
ప్రపంచం చాలా చిన్నది ,
స్నేహం చాలా గొప్పది
నను మరిచి నా......
నా మాట మరువకు నేస్తం !


నీ విరహంతో మది మౌనపీఠం అదిష్టిస్తే
మది లేని ఈ మట్టి చెత్త ఏదో మనుగడ సాగిస్తోంది!
నీ కమ్మని వలపుల తలపులతో.....
నీ ప్రేమ లోకంలో విహంగం లా విహరిస్తోంది
వస్తావు కదూ ! నీ మాటల తో కవ్విస్తావు కదూ ..!


సీతా.....
కఠిన హృదయుడనై నిను కారడవిలో
వదిలి రమ్మని ఆనతిచ్చిన ఆ గడియన
నీ రాముడికి ఆ అయ్యోదాదిపతి కి జరిగిన
ఆ సంఘర్షణ  ఏమని చెప్పను !

నిండుగర్బిని అయిన నా నీలవేణిని 
నిరంకుశముగా అడవిపాలు చేసిన
ఆరఘుకులోత్తముడికి,నీ హృదయరాముడికి
జరిగిన ఆ సంబాషణ ఏమని చెప్పను!

పామరుడు పలికిన అల్పబుద్ది  మాటకి
ఈ కులకాంతను కానలపాలు చేస్తావా అని
మా అమ్మ అడిగిన ప్రశ్నకు సమాదానం ఇవ్వలేని
ఆ కొడుకు మనోవ్యధ ఏమని చెప్పను!
 
అడవిలో నీవున్నా
అంతః పుర జనారణ్యం లో నేనున్నా
నిను నిమిషమైన మరువలేదని
విగతజీవిలా జీవించానని నీకు ఎలా వివరించను!

పుట్టిన పసికందులను పోత్తిలలో హత్తుకొని
ఆ బోసినవ్వుల  ముఖారవిందాన్ని    
ప్రియమార తడమాలని తల్లడిల్లిన
ఓ కన్న తండ్రి తపన ఏమని వివరించను!

అమ్మ సహకారం,అపార  ప్రేమ తో నువ్వు  చేసిన
ఈ ఆదర్శ జీవనయాత్ర లో
రామచంద్రా ! నిను వరించినది యశోకాంతనా     
ఎనలేని ఎడబాటు, ఒంటరితనపు నిశ్శబ్ద ఆవేదన నా
అని నను నిలదీసి అడిగిన మానవుడికి
ఒక భర్త లా ఏమని నిజం చెప్పను!

సీతా..!
పూలు లేని వసంతం
రవి లేని ఉదయం
వెన్నల లేని పున్నమి
నీవు లేని నేను
ఎప్పటికి అసంపూర్ణం
నేను సీతారాముడిని!


ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది

రోజువారి జీవితంలో ఆటవిడుపుగా చేయగలిగినది
చేయాలనే ఆలోచన ఒక అంతర్మదనానికి దారి తీసింది

ఆ క్షణమే బాద్యతనెరిగినట్లు
జీవితంలో క్షణకాలం వెడలి
ఒకపరి రెండు మంచి మాటలు పలికి
పరమదయాలు అని బిరుదాంకితురాలివైన నీవు
మరలి వచ్చు వేళ ఆ చిన్నారి కనులకు
ఏమని బదులు చెప్పావు?

ఒక ప్రశ్న శరం నన్ను బ్రహ్మస్త్రమై తాకింది
కుంటి సాకులు చెపితే మోహం నిస్త్రానమయింది!

ఎవరికీ ఎవరు ఏమి కాని ఈ లోకాన
తాను అనాధనని తనకే తెలీని అలౌకిక ప్రయాణ
రెండు బన్ను ముక్కలిచ్చిన నిన్ను
ప్రియమార తడిమిన ఆ లేత చేతులకు
ఏమని బాస చేసి వచ్చావు?

ఆలోచన తరంగం ఉప్పెనలా నన్ను అలుముకుంది
మాటవరసకు కూడా జవాబు చెప్పలేని మనసు మూగపోయింది!

ఆ బోసినవ్వుల మోమును,ముదమార తాకితే
ఆ ప్రేమ తనకు శాశ్వతమనుకొని
స్వచమైన ప్రేమ తో ఆ లేత మనసు
నీ చెక్కిలి పై చేసిన మదుర సంతకానికి
ఏమని రాసిచ్చి వచ్చావు?

ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది


చాలా రోజులయింది నేస్తం
ఇలా నిదురలేని రాతిరి గడిపి
నీ స్నేహపు చిరుజల్లు లో తడిసి
నిను మరచిపోయానని అనలేను
మరవడానికి నేవో జ్ఞాపకం కాదు
నా జీవితం లో భాగం నీవు...

ఆ హాస్టల్ ఆవరణ,కాంటీన్ లో చేసిన అల్లరి
మన సుబ్బిగాడి తో దోశల కోసం చేసిన రగడ
తోట లోని గులాబీలన్ని నాకే సొంతం అని నీవు చేసిన బీభత్సం
నా కురుల అలంకరించ నీవు నాటిన ఆ మల్లెపాదు
ఇప్పుడు అక్కడ పూలు పూస్తుందో లేదో కాని ,
విజ్జీ...!వాటి పరిమళం మాత్రం నను తాకుతూనే ఉంది

నేనెవరని నను అంతగా ప్రేమించావు?

నాకోసం నువ్వు చేసిన పార్ట్ టైం జాబులు
నా రిజల్ట్స్ కి మనం చేసుకున్న పానిపురి పార్టీలు
న్యూ ఇయర్ సంబరాలు,
మెస్ బిల్లులతో వేసుకున్న బోగి మంటలు
హోలీ లో నన్ను సప్తవర్ణాలతో ముంచెత్తి
ముచ్చటపడిన తీరూ,దోభి గాటు లో మన కూనిరాగాలు
గప్పాలు కొడుతూ ,వెన్నెల్లో పాటలు పడుతూ
స్నేహజీవితం అందం అని నీవు చెప్పిన తీరూ!

ఏమని చెప్పను కుట్టి!
ప్రేమని చెప్పడానికి నాకు సంశయం లేదు
కాని ప్రపంచానికి తెలిసింది ఆడ మగా ప్రేమే..!
అయినా ఆ చిన్న పదం నీకు నే ఆపాదించలేను

నాలో అంత వింతేమి ఉందో ఇప్పటికి నాకు తెలీదు
నీతో ఉన్న ప్రతీ క్షణం ప్రేమ తప్ప మరోటి నేను చూడలేదు
అన్నిటికి కొసమెరుపుగా నువ్వు నన్ను అమ్మా అని పిలిచే పిలుపు
అన్నీ నువ్వు చేస్తూ..
కంటికి రెప్పల ప్రేమిస్తూ..
నేను నీ అమ్మ నని సంబోధించావే
ఏమి చేసాను రా నీకు
ఓ రెండు ఓదార్పు మాటలు తప్ప!
నీకు నేను అమూల్యం అంటావు ఇప్పటికి
కాని నేస్తం నువ్వు నా జీవితం లో ఓ సువర్ణాక్షరం
దేవుడిచ్చిన అత్యంత ప్రీతీ కరమైన వరం
సఖి !నీ స్నేహం మధురాతి మధురం!
I MISS U RAA















About Us