నిన్న రాత్రి.................
పండు వెన్నెలల పిండారబోసినట్లుంది
ఆ రేయి లో నేను....నా ఏకాంతం
నా లో మెదిలే తన జ్ఞాపకం
ఎవరో పిలిచినట్టు
ఉలిక్కిపడి పైకి చూసా
ఆ నింగిన జాబిలీ
నా తో మాటలాడుతోంది
నన్నిలా ప్రేమగా అడగసాగింది
ఎవరు తాను ? ఏమిటా కథ అని?
చెప్పేంత విషయమేమీ లేదని నేనన్నా!
ఎలా ఉంది నీ జీవితం అని?
ఏ ఆరాటం లేని ప్రశాంతత అని నేనన్నా!
ఏమైనా ఈప్సితం తీర్చనా సఖి అని ?
ఇచ్చాలోకం కు ఆవల నేనున్నా అని నేనన్నా!
ఎవరినైనా ప్రేమించావా ప్రియా అని?
ఇసుమంతైనా అలాంటి ఊసే లేదని నేనన్నా!
ఏమైనా వంచన తో వగచావా అని?
మచ్చుకైన అలాంటి జ్ఞాపకమే లేదని నేనన్నా!
అప్పుడు తానంది మరి నీకోవిషయం చెప్పనా అని?
చెప్పవమ్మా చల్లనమ్మా అని నేనన్నా!
తను...........చెప్పిందిలా
ఎవరినైతే తలచి వలచావో
తన తోడు నీకు ఈ గడియన లేదు కదా...! అని....
నేను..........................................................
పండు వెన్నెలల పిండారబోసినట్లుంది
ఆ రేయి లో నేను....నా ఏకాంతం
నా లో మెదిలే తన జ్ఞాపకం
ఎవరో పిలిచినట్టు
ఉలిక్కిపడి పైకి చూసా
ఆ నింగిన జాబిలీ
నా తో మాటలాడుతోంది
నన్నిలా ప్రేమగా అడగసాగింది
ఎవరు తాను ? ఏమిటా కథ అని?
చెప్పేంత విషయమేమీ లేదని నేనన్నా!
ఎలా ఉంది నీ జీవితం అని?
ఏ ఆరాటం లేని ప్రశాంతత అని నేనన్నా!
ఏమైనా ఈప్సితం తీర్చనా సఖి అని ?
ఇచ్చాలోకం కు ఆవల నేనున్నా అని నేనన్నా!
ఎవరినైనా ప్రేమించావా ప్రియా అని?
ఇసుమంతైనా అలాంటి ఊసే లేదని నేనన్నా!
ఏమైనా వంచన తో వగచావా అని?
మచ్చుకైన అలాంటి జ్ఞాపకమే లేదని నేనన్నా!
అప్పుడు తానంది మరి నీకోవిషయం చెప్పనా అని?
చెప్పవమ్మా చల్లనమ్మా అని నేనన్నా!
తను...........చెప్పిందిలా
ఎవరినైతే తలచి వలచావో
తన తోడు నీకు ఈ గడియన లేదు కదా...! అని....
నేను..........................................................
2 comments:
KRISHNA-A GOOD FRIEND FOREVER said...
నిన్న రాత్రి.................
పండు వెన్నెలల పిండారబోసినట్లుంది
ఆ రేయి లో నేను....నా ఏకాంతం
నా లో మెదిలే తన జ్ఞాపకం
chala bagundi siri garu..so nice words from u..akshara sumam blog chala cool ga undi..oka sahitya vanam loki viharaniki vochhinatlu undi..keep it up madam..
Madhav said...
వెన్నెల రాత్రి జాబిలితో మాటలాడడం ఎంత హాయిగా వుంటుందో , మీ కవిత చదువుతూ వుంటే అలాగే వుంది. రెండు మూడు సార్లు చదివినా మంత్ర ముగ్దమై ఆస్వాదించడమే గాని విమర్శ గురించిన స్ఫురణ లేదు. విమర్శ చేయ వలసిన అవసరము లేదు. ఈ కొత్త దనం , ఈ భావుకత్వం మీ బ్లాగును ఫాలో అయ్యేలా చేస్తాయి.