శిశిరం లో కొత్త చిగురు వింత కాని
ఆకురాల్చే ఆ సోయగానికి చింత ఏల?
వలచి వచ్చానంటే విభ్రమంకాని
అపరిచితలా నిను దాటి వెళ్తే ఈ చిత్తభ్రమ ఏల ?
ఆ స్వరసంజాత తన పలుకు కులుకు ఆలకించ మందే కాని
ఆ మంజునాధం నీ యధసవ్వడిలా ధ్వనిస్తే ఆ కోమలి దోషమేలా?
కలలు కన్న నీ కనులు
వెర్రెక్కించిన మది ఊసులు
నిలువలేక ఒర్రుతలూగిన వయస్సు
స్థిమిత బుద్ది మాట చెవినపెట్టకపోతే
హృదయం లేని ప్రియురాలా అని తన పై నిందలేల?
వినకు వెర్రి మనసు మాటలు
రేపును విరహపు వెండిమంటలు
శలభం లా మాడిపోయేదవు నేస్తం
శిశిరంలో ఆకులా రాలిపోయేదవు సమస్తం!
శిశిరం తరవాత వసంతం అనివార్యం
కొత్త చిగురు వచ్చును తధ్యం
కాని రాలిన ఆకు చరిత శూన్యం
అనాలోచిత మోహపు మైకం లో
చేసుకోకు నిర్లిప్తం ఈ క్షణం
ఆకురాల్చే ఆ సోయగానికి చింత ఏల?
వలచి వచ్చానంటే విభ్రమంకాని
అపరిచితలా నిను దాటి వెళ్తే ఈ చిత్తభ్రమ ఏల ?
ఆ స్వరసంజాత తన పలుకు కులుకు ఆలకించ మందే కాని
ఆ మంజునాధం నీ యధసవ్వడిలా ధ్వనిస్తే ఆ కోమలి దోషమేలా?
కలలు కన్న నీ కనులు
వెర్రెక్కించిన మది ఊసులు
నిలువలేక ఒర్రుతలూగిన వయస్సు
స్థిమిత బుద్ది మాట చెవినపెట్టకపోతే
హృదయం లేని ప్రియురాలా అని తన పై నిందలేల?
వినకు వెర్రి మనసు మాటలు
రేపును విరహపు వెండిమంటలు
శలభం లా మాడిపోయేదవు నేస్తం
శిశిరంలో ఆకులా రాలిపోయేదవు సమస్తం!
శిశిరం తరవాత వసంతం అనివార్యం
కొత్త చిగురు వచ్చును తధ్యం
కాని రాలిన ఆకు చరిత శూన్యం
అనాలోచిత మోహపు మైకం లో
చేసుకోకు నిర్లిప్తం ఈ క్షణం
0 comments: