ఎన్ని రోజులు ఈ మౌనం
ఇంకెన్ని రోజులు ఈ క్షణ క్షణ మరణం

స్వప్నం సత్యం కాలేదని
తలచి తలచి వగచేవు
సాలోచన దిశ గా
అడుగువేయుట మరిచేవు !

నీవు కోరావని జరగవు అన్నీ
కాదన్నావని ఆగవు కొన్ని
ఆటుపోటుల మిశ్రమం ఈ జీవితం!

ఓటమి లో కూడా చూడు విజయం
ఈ క్షణమిన్తే అని తృప్తి నొంది
గడుపుటయే కదా ఆ క్షణ ఆనందరహస్యం!

కన్నీటి కాలువనందైన
కత్తి  పడవ నడుపుట నేర్చుకో
ముళ్ళబాటలో ముందడుగు వేస్తే
శహబాష్ అని మనసారా నిను నీవు  మెచ్చుకో!

మనసే బలం,మనసే బలహీనత
నీ మనోరాజ్యని మొదట జయించు
సవాలు వేసే సహజలక్షణం తనదైతే
దాని సరదా తీర్చే సత్తా నీది !

కాలాన్ని  బట్టి నడిచేది కొందరు
కాలం తో పోరాడేది కొందరు
కాలాంతం వరకు చరిత లో నిలిచేది ఎందరు!

సువాసన లేని గంధపు చెక్క
రాతిరిన మెరియని నింగిన చుక్క
ఎన్నడు వసి వాడని కుసుమపు రెక్క
కన్నీటికి తడవని చెక్కిలి
సాధ్యమవునా నేస్తమా!

మరెందుకు ఈ తపన
నిశ్శబ్ద నరక యాతన !


This entry was posted on 11:59 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    Madhav said...

    Good

  1. ... on February 20, 2010 at 7:45 AM  

About Us