నా కనుల కొలనులో బాష్ప కమలం వికసించినపుడు
నీ మదుర స్మృతి నిన్ను బాదిస్తుందా అని అంటోంది చిరుగాలి !
ఏకాంతంగా మౌనంగా గుబులు గుబులు గా ఉన్నప్పుడు
నీ తో మాట్లాడాలని ఉందా అని ప్రశ్నిస్తాయి ముంగురులు!
సభలో స్తబ్దత గా ఉంటె ఏ సందడి చేయకుంటే
నీవు లేని లోటు కనపడుతుందా అంటుంది మనోగతం !
ముస్తాబై నీరాకకై ఎదురుచూస్తున్న వేళ
నీకు నేను ఒక యుగంలా ఉన్నానా అని కవ్విస్తుంది నిమిషం !
అన్నింటికీ తెలుసు నాకు నీ మీదున్న ఆప్యాయత
కాని నీకు తెలియదో ,తెలిసినా మరచావో
ఏది తేలక ,తెలుసుకోలేక నే సతమవుతున్నా !
నిజం చెప్పవా నేస్తం!
నాకు ఈ తీయటి మాటలకన్నా
చేదుగా ఉన్నా నీవు చెప్పే నిజాన్నే ప్రేమిస్తా!

0 comments: