చకోరపక్షిలా వేచి చూస్తాను
ఏనాటికైనా నేనే నీ చెలినైతే!
సమాజానైనా ఎదురిస్తా
నీ ప్రేమ లో స్వచ్ఛత ఉంటె!
నీ కలగానైనా మిగిలిపోతాను
నీకు నేనుఒక మదుర స్మతినైతే !
నా మృగ తృష్ణ జీవితం లో
ఎండమావులే ఉన్నాయనుకున్నా ఇన్నాళ్ళు!
నీ ఆగమనంతో తెలిసింది..........
నే ఎడారిని కాను పూతోటకి ఆరంభానని!
నీ మది మేఘుడు ప్రేమాంబుధి తో నను తడపగా
నీ రాక తో నే పున్నమినాటి బృందావనినయ్యాను!
కాని..
ఎడారిలానే బాగున్నాను...
ఎవరు రారు శబ్దంలేని ప్రశాంతత
నీవు ప్రాణంపోసిన బృంధావనిలోకినిలోకి
ఎవరైనా వస్తే సహించగలనా
కల్పించుకొని మరీ వస్తాయి తుమ్మెదలు
ఆ పూ తేనెల విందులకి
మరి
ఆ మరో రూప సృష్టి కర్తవి
నీవా పూల సుగందానికి దూరంగా ఎందుకు
కాని మర్చిపోకు ఈ మదిబృందావని నీది ఎప్పటికి....
ఏనాటికైనా నేనే నీ చెలినైతే!
సమాజానైనా ఎదురిస్తా
నీ ప్రేమ లో స్వచ్ఛత ఉంటె!
నీ కలగానైనా మిగిలిపోతాను
నీకు నేనుఒక మదుర స్మతినైతే !
నా మృగ తృష్ణ జీవితం లో
ఎండమావులే ఉన్నాయనుకున్నా ఇన్నాళ్ళు!
నీ ఆగమనంతో తెలిసింది..........
నే ఎడారిని కాను పూతోటకి ఆరంభానని!
నీ మది మేఘుడు ప్రేమాంబుధి తో నను తడపగా
నీ రాక తో నే పున్నమినాటి బృందావనినయ్యాను!
కాని..
ఎడారిలానే బాగున్నాను...
ఎవరు రారు శబ్దంలేని ప్రశాంతత
నీవు ప్రాణంపోసిన బృంధావనిలోకినిలోకి
ఎవరైనా వస్తే సహించగలనా
కల్పించుకొని మరీ వస్తాయి తుమ్మెదలు
ఆ పూ తేనెల విందులకి
మరి
ఆ మరో రూప సృష్టి కర్తవి
నీవా పూల సుగందానికి దూరంగా ఎందుకు
కాని మర్చిపోకు ఈ మదిబృందావని నీది ఎప్పటికి....
1 comments:
Unknown said...
for me antha talent ledu to post comment on this.... nenithe entha range ki reach avadam chala kashtam