అవును! ఇక నేను లేను!
అనుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా
జీర్ణించుకోవడం కష్టం గా ఉన్నా
నిజం ఎప్పుడు అలానే ఉంటుందనే లా
ఒప్పుకోక తప్పట్లేదు ,ఇక నేను లేను!
ఇక నాకు ఏ బుజ్జగింపులు ఎందుకు?
ఏ సమాధానాలు ఎందుకు?
నిదురలేని రాత్రులు ఉండవు
తడిసిన చెక్కిళ్ళు ఉండవు
హాయిగా ఉంది ఒక్క సారి
మనస్పూర్తి గా ఒప్పుకున్నాకా!
అవును ! ఇక నేను లేను........
అనుకున్నది ఉంటేనేగా
జరగలేదని ఏడవటానికి
ఆ కోరికల వలయం లో
అవును! ఇక నేను లేను.......
నిరంతర శిల్పిలా ఆ విధాత
కాలమనే ఉలి తో నన్ను చెక్కుతుంటే
ఉన్నదే శాశ్వతమనుకునే భ్రమ లో
అవును! ఇక నేను లేను.......
ఎందుకలానే ఉండాలనే ప్రశ్న ఉదయించాకా
ఏది నిస్వార్ధం గా ఉండదని తెలిసాకా
అంతరంగపు తుఫానులో దిక్కుతోచక
అవును! ఇక నేను లేను.........
కల్మషంలేని చిన్నారి చిరునవ్వుకై
నేను ఉంటె చాలు
నేను అనే నేనుని వదులుకున్నా
ఫర్వాలేదు అని తెలిసాకా
నేను అనే పరిధిలో
అవును! ఇక నేను లేను !
1 comments:
కెక్యూబ్ వర్మ said...
నేను అన్న ఎరుకను కోల్పోయి తాదాత్మయం చెందడం బాగుంది...