నా చిరునామా ఎవరిచ్చారో కాని
జ్ఞాపకాల పుస్తకం వెంటేసుకొని
మది మరిచిన మమతల పెనవేసుకొని
ఈ ఖాళి నన్నూ ఈ మధ్య ఏడిపిస్తుంది
ఈ ఖాళి నన్నూ ఈ మధ్య ఏడిపిస్తుంది
అంతా ఒక్కసారిగా ఖాళి
గతం ఏది లేదన్నట్టు
ఉన్నది నాది కాదన్నట్టు
ఒక అపరిచిత వ్యక్తి లా
నాకు నేనే ఒక ఖాళి లా
పనుల మార్పు నే విశ్రాంతి నాకు
మరి ఏ క్షణాన నేను దొరికానో
నన్నూ ఎలా ఒడిసి పట్టిందో తెలీదు కానీ
మరిచిపోయిన ఆశలని
సమాధి అయిన ఊసులని
మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ
నాలో నేను లేనా అంటూ ప్రశ్నిస్తూ
సతమతమయ్యేలా చేస్తూ
సంబరపడుతుంది ఈ ఖాళీ
నీశిది నుండి సుప్రభాతం వరకు
నాతో నేను మమేకమై
ప్రశాంతమై నిర్మలమై
ఆ నింగి లో ని చుక్కని
నా కంటిని తడిపిన చుక్కని
రెంటిని ఆస్వాదించే నన్నూ
ఎలా చేజిక్కిన్చుకుందో మరి
ఏమిటి నీ కథ?
చెప్పరాదా నీ వ్యధ?
అని అడుగుతూనే ఉంది ఆ ఖాళి
ఆ ఖాళీ ని సంపూరించ నీవు లేవని
నీవు లేని నేను ఒత్తి ఖాళి నని
ఎలా చెప్పను దానికి ?!
-నీ జ్ఞాపకాలలో నేను
0 comments: