ఏమవుతుంది నా జీవితం
ఎటు వైపు ఈ పయనం
ఏమిటో ఆపైవాడి అభిమతం

బాల్యం ఆ బుడిబుడి నడకలు
అమ్మవోడి అటునుండి వడివడి గా బడి
అక్షరమాల వచ్చింది అనేలోపు మరో ముందడుగు

ఈ మలుపు లో ఏ తీర్పు ఉందో
ఆ తీర్పు లో ఈ మార్పు ఉందో

అల్లరి ఆటలు,ప్రేమ ఊసులు
యవ్వనం వచ్చేసిందన్నకొంగోత్తభావం
ఆశలు ఆశయాలు గ మారే తరుణం

ఈ మలుపు లో ఏ పిలుపు ఉందో
ఆ పిలుపు లో ఈ గెలుపు ఉందో

ఉద్యోగం లో నూతన ఉత్సాహం
సంసారనౌక లో తొలి ప్రయాణం
ప్రతి పిలుపు వలపు నాదే నన్నభావం

ఈ పిలుపు లో ఏ మధురిమ ఉందో
ఆ మధురిమ లో ఏ తంత్రం ఉందో

జనని జనక స్థానం
అదో సుందర అనుభవం
మరో సారి మనకు బాల్యం

ఆ బాల్యం లో ఏ భావం ఉందో
ఈ భావం లో ఏ బాధ్యత ఉందో

అంతు లేని అనంత సాగరం
అనాది గా ఇంతేనా జీవితం
ఎన్ని ఉన్నా ఏదో కావాలి
ప్రతి బంధం లో ప్రేమ కావాలి
ఏమిటీ స్వార్థం ,ఎందుకీ వెర్రి వ్యామోహం ?

ఏమిటో ఈ జీవితం
ఎటు వైపు ఈ పయనం


This entry was posted on 8:23 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments:

About Us