ఈ రాతిరి ఎంతకీ గడవదేమి
పున్నమి వెన్నల కూడా
వేసవి మండుటెండలా మారేనేమి
క్షణమొక యుగమంటే   నేను నవ్వుకున్నా
కాలాన్ని త్వరగా సాగమని నేడు  వెడుతున్నా!

ఎన్ని ఉన్నా ఏదో వెలితి
ఎప్పుడు ఏదో ఒకటి కోరే మనసు
లేదా నాకు మానసిక పరిణితి
లేక ఇది తన ప్రేమ ప్రవాహపు ఉధృతి


బంగారు.. అని తాను పిలిచే పిలుపు
కోటి జన్మలకైనా సరిపడే వలపు
నేను చంటి పాపను కావాలని ఉంది
తన కంటి పాప లో దాగాలని ఉంది

ప్రాణమా!
నిదుర పోనీ ఈ కనులకు చెప్పు
తొలిజాము కలలోకి నీవొస్తావని
గడవని ఈ విరహపు రేయి కి చెప్పు
తొలి ఉషాకిరణంతో నీవొస్తావని

ప్రియా!   ప్రౌడనైనా నాకు ఈ ప్రేమేమిటి?
నీ ఊసులతో,నీ ఊహలతో
నను దహించు ఈ విరహమేమిటి?
నువ్వు ఇలానే ఉన్నావా!
నా పేరే పలవరిస్తున్నావా!



 



This entry was posted on 5:18 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

    హను said...

    nice chala bagumdi,good work

  1. ... on November 10, 2009 at 11:57 PM  
  2. నరసింహ మూర్తి said...

    అనాదిగా సాగుతున్న ఈ విరహ సంఘర్షణను ఎంత బాగా చెప్పారు.... మీ బ్లాగ్ ఒక మణిహారం అనుకుంటే దానిలో ఈ కవిత కోహినూర్ వజ్రం లా అనిపించింది.... మీ నుంచి ఇలాగే మరిన్ని కవితలను ఆశిస్తూ

    భవదీయుడు
    నరసింహ మూర్తి

  3. ... on November 12, 2009 at 10:12 AM  
  4. siri said...

    narsimhamoorthi gaaru!
    meeru opika ga chadivi mee abhiprayam thelipinduku naa dhanyavaadaalu

    Siri

  5. ... on November 12, 2009 at 11:07 PM  

About Us