కోదండరాముడు కౌసల్య రాముడు
సీతామనోభిరాముడికా ఈ దుఃఖం
విశ్వాంతర్యామికా ఈ విషాద వదనం

జనస్థానమైనా వానప్రస్తమైనా
సీత వెంటే రాముడు,రాముడి తోడనే సీత
ఎడబాటు ఈ అశాశ్వత కలేబరానిదే కాని
అనంత ప్రేమది కాదు,
ఆత్మల కలయికకు ఎడబాటు లేదు
కానలకు పంపి నీవెంత కలవరపడ్డావో
నాకు తెలియనిదా ప్రభూ!

అడవిలోనేనున్న,నీఅపారదయతో
లోకపావనినైనాను,మునిపూజితనైనాను
అంతఃపురానానీవున్నా ,
అంతరాత్మ ఎన్ని బోధలు చేసినా
సువర్ణ సీత నీ ఎదుట ఉన్నా
ఈ భూజాత ను మరువలేదని
నాకు తెలీదా స్వామీ !

మన జీవనయానంలో,
మరి ఆ అశ్వమేదయాగంలో
నా లోటుకు ,ఈక్షణిక ఎడబాటు కు
నీ హృదయం దుఖించిన వైనం
పదాలకు అందని ఆ బాదతప్త క్షణం
నీనాకు తెలియనిదా దాశరథి!

లోకం నిన్ను వెర్రి రాముడన్నా
లక్ష్మణ సోదరుడు నినునిలదీసినా
మనోనిబ్బరం చూపిన ఆఅయోధ్యరాముడి
మానససరోవరంలో ఎన్నిఅలలో
కలవరింతలేని రేయిలేదని
నేను ఎరుగనా నాస్వామీ!

వనరాజ్యం,జనరాజ్యం రెండు నీఏలాను
నీమనోబిరాజ్యభిశక్తు రాలినై
సీతమనోభిరామా అని ఖ్యాతి పొందాను
క్షణికము కు నే వగచిన మాట నిజమే
కాని నీఆంతర్యం తెలిసి నీసితప్రజ్ఞనయ్యాను
ఎచటి నుండి వచ్చితినో అచ్చోటికే మరలిపోయేదా!
నామనవి మన్నించు పురుషోత్తమా!


This entry was posted on 11:32 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

    Unknown said...

    kavitalo baagaa mecchukodaggadi nuvvu vaaDina bhaashaa prayogam. bhaavaaniki ae maatram aDDu raakunDaa nuvvu vaaDina prayogaalu adbhutangaa unnaayi. bhaasha paTTu unTaenae ilaanTivi raayaDaaniki saahasinchagalaru. meeru adi chesaaru. gud
    -LaxmaN

  1. ... on November 7, 2009 at 11:54 PM  
  2. నరసింహ మూర్తి said...

    అమ్మ సీతమ్మ భావుకతను, ఈ కాలంలో కూడ ఇంత భావుకతతో అర్థం చేసుకో గల్గిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను....

  3. ... on November 12, 2009 at 9:58 AM  
  4. siri said...

    Thank you to both of you

  5. ... on November 22, 2009 at 2:41 AM  

About Us