సీతా.....
కఠిన హృదయుడనై నిను కారడవిలో
వదిలి రమ్మని ఆనతిచ్చిన ఆ గడియన
నీ రాముడికి ఆ అయ్యోదాదిపతి కి జరిగిన
ఆ సంఘర్షణ  ఏమని చెప్పను !

నిండుగర్బిని అయిన నా నీలవేణిని 
నిరంకుశముగా అడవిపాలు చేసిన
ఆరఘుకులోత్తముడికి,నీ హృదయరాముడికి
జరిగిన ఆ సంబాషణ ఏమని చెప్పను!

పామరుడు పలికిన అల్పబుద్ది  మాటకి
ఈ కులకాంతను కానలపాలు చేస్తావా అని
మా అమ్మ అడిగిన ప్రశ్నకు సమాదానం ఇవ్వలేని
ఆ కొడుకు మనోవ్యధ ఏమని చెప్పను!
 
అడవిలో నీవున్నా
అంతః పుర జనారణ్యం లో నేనున్నా
నిను నిమిషమైన మరువలేదని
విగతజీవిలా జీవించానని నీకు ఎలా వివరించను!

పుట్టిన పసికందులను పోత్తిలలో హత్తుకొని
ఆ బోసినవ్వుల  ముఖారవిందాన్ని    
ప్రియమార తడమాలని తల్లడిల్లిన
ఓ కన్న తండ్రి తపన ఏమని వివరించను!

అమ్మ సహకారం,అపార  ప్రేమ తో నువ్వు  చేసిన
ఈ ఆదర్శ జీవనయాత్ర లో
రామచంద్రా ! నిను వరించినది యశోకాంతనా     
ఎనలేని ఎడబాటు, ఒంటరితనపు నిశ్శబ్ద ఆవేదన నా
అని నను నిలదీసి అడిగిన మానవుడికి
ఒక భర్త లా ఏమని నిజం చెప్పను!

సీతా..!
పూలు లేని వసంతం
రవి లేని ఉదయం
వెన్నల లేని పున్నమి
నీవు లేని నేను
ఎప్పటికి అసంపూర్ణం
నేను సీతారాముడిని!


This entry was posted on 6:46 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    kiran said...

    wahwaa.....entha bagundooo :))

  1. ... on May 31, 2011 at 8:30 AM  

About Us